Asianet News TeluguAsianet News Telugu

Eagle OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో రవితేజ `ఈగల్‌`.. ఇంత త్వరగానా?

రవితేజ సినిమాలకు ఓటీటీ డీల్‌ కావడం లేదంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో `ఈగల్‌` ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యింది. అంతేకాదు సడెన్‌ సర్‌ప్రైజింగ్ గా ఇది స్ట్రీమింగ్‌ కాబోతుంది.

raviteja eagle movie streaming in two ott platforms at a time arj
Author
First Published Feb 29, 2024, 8:51 AM IST

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ఈగల్‌` సినిమాతో వచ్చాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన మూవీ ఇది. స్టయిలీష్‌ యాక్షన్‌ మూవీగా నిలిచింది. కానీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. భారీ నష్టాలనే తీసుకొచ్చింది. సినిమాటోగ్రాఫర్‌ కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించగా, అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్ గా నటించారు. ఆర్మీ అధికారిగా మధుమాల, శ్రీనివాస్‌ అవసరాల నటించారు. రవితేజ సహచరుడిగా నవదీప్‌ కనిపించారు. 

ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. థియేట్రికల్‌గానూ బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకోలేకపోయిందనే వార్తలు వచ్చాయి. దీనికితోడు ఓటీటీ బిజినెస్‌ కూడా కాలేదంటూ ప్రచారం జరిగింది. కానీ ఇటీవలే ఓటీటీ డీల్‌ సెట్ అయ్యింది. రెండు ఓటీటీలు ఈ మూవీని తీసుకున్నాయి. ఈటీవీ విన్‌, అలాగే అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నాయి. అయితే ఎలాంటి అమౌంట్‌ పే చేయలేదని తెలుస్తుంది. ఆడియెన్స్ చూసే వ్యూస్‌ని బట్టి దీనికి పేమెంట్‌ చేయబోతున్నారట. వ్యూస్‌ మినిట్స్ ఆధారంగా పేమెంట్‌ ఉంటుందని తెలుస్తుంది. ఈ లెక్కన సినిమా నిర్మాతలకు వచ్చేది అత్తెసరు మాత్రమే అని చెప్పొచ్చు. 

Read more: ప్రభాస్‌, హనురాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ ఇదే ? .. `రాధేశ్యామ్‌` ని గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్ గగ్గోలు

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏక కాలంలో ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో `ఈగల్` సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అది కూడా చాలా త్వరగా వస్తుంది. ఈ రోజు రాత్రి(మార్చి 1) నుంచే ఈ మూవీ `ఈటీవీ విన్‌`, `అమెజాన్‌ ప్రైమ్‌`లో స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్లో జనం ఈ మూవీని పెద్దగా చూడలేదు. దీంతో ఓటీటీల్లో అయినా చూస్తారని భావిస్తున్నారు. మరి ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. అయితే రవితేజ సినిమాలకు ఓటీటీలో పెద్దగా ఆదరణ ఉండటం లేదట. ఇదే చాలా మంది హీరోల పరిస్థితి ఇదే అని అంటున్నారు. మరి మాస్‌ రాజా ఇప్పుడు ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి. 

Also read: `ఎస్‌ఎస్‌ఎంబీ29`లో మహేష్‌తోపాటు కలిసి నటించే స్టార్‌ హీరో ఫిక్స్?.. జక్కన్న మామూలోడు కాదుగా!
 

Follow Us:
Download App:
  • android
  • ios