Asianet News TeluguAsianet News Telugu

యంగ్ హీరోయిన్ తో ఈవయసులో రవితేజకు హాట్ లిప్ లాక్ సీనా..!

రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఆయన ఖిలాడీ అనే చిత్రం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఖిలాడీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రవితేజ ఇమేజ్ కి చక్కగా సరిపోయే ఖిలాడీ టైటిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ మూవీలో రవితేజ లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొన్నాడట. దీనికి సంబంధించిన ఫోటో బయటికి రాగా వైరల్ అవుతుంది.

raviteja acts in liplock scene with young heroin for khiladi movie ksr
Author
Hyderabad, First Published Jan 20, 2021, 2:51 PM IST

రవితేజ క్రాక్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏళ్లుగా వెంటాడుతున్న ప్లాప్స్ నుండి బయటపడేసిన క్రాక్ విజయాన్ని గట్టిగా ఆస్వాదిస్తున్నాడు. సరైన హిట్టులేక ఒత్తిడితో సతమతమైన రవితేజకు దర్శకుడు గోపి చంద్ మలినేని సాలిడ్ హిట్ ఇచ్చాడు. క్రాక్ సంక్రాంతి విన్నర్ గా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. 

మరోవైపు రవితేజ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఆయన ఖిలాడీ అనే చిత్రం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఖిలాడీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. రవితేజ ఇమేజ్ కి చక్కగా సరిపోయే ఖిలాడీ టైటిల్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ మూవీలో రవితేజ లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొన్నాడట. దీనికి సంబంధించిన ఫోటో బయటికి రాగా వైరల్ అవుతుంది. 

ఖిలాడీ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరికి రవితేజ హాట్ లిప్ కిస్ ఇచ్చేశాడట. కథలో భాగంగా వచ్చే ఈ సన్నివేశంలో నటించడం రవితేజకు తప్పలేదట. నిజానికి ఈ సీన్ లో నటించడానికి రవితేజ నిరాకరించారట. అయితే దర్శకుడు రమేష్ వర్మ పట్టుబట్టి చేయాల్సిందే అని రవితేజను ఒప్పించాడట. 52ఏళ్ల రవితేజ లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొనడం అంటే సంచలనమే అనాలి.  ఖిలాడీ మూవీలో డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios