రవితేజ 'రావణాసుర' సెన్సార్ పూర్తి.. ఊహించని విధంగా 'ఏ' సర్టిఫికేట్, ఎందుకంటే

గత ఏడాది చివర్లో ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది సమ్మర్ లో తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Ravi Teja Ravanasura movie done its censor

గత ఏడాది చివర్లో ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది సమ్మర్ లో తన మాస్ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రవితేజ మర్డర్స్ చేసే లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

'మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ అంటూ రవితేజ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. రావణాసుర చిత్రం ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

Ravi Teja Ravanasura movie done its censor

తాజాగా రావణాసుర చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ జారీ చేశారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే చిత్రానికి చిన్నపాటి ఝలక్ అనే చెప్పాలి. చిత్రంలో వయొలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాబట్టి సెన్సార్ సభ్యులు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. 

అయితే చిత్ర రన్ టైం, కట్స్ ఏమైనా సూచించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ లాంటి అందాల భామలు నటిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 1న రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios