Asianet News TeluguAsianet News Telugu

రవితేజ 'మిస్టర్ బచ్చన్' మాస్ ట్రైలర్ చూశారా.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే.. 

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Ravi Teja Mr.Bachchan Trailer out now dtr
Author
First Published Aug 7, 2024, 8:06 PM IST | Last Updated Aug 7, 2024, 8:06 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. 2.25 నిమిషాల నిడివితో ట్రైలర్ కట్ అదిరిపోయింది. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ ట్రైలర్ ని వదిలారు. రవితేజ పంచ్ డైలాగ్స్, హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రవితేజ ఈ చిత్రం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారిగా నటిస్తున్నారు. 

సరిహద్దు కాపాడే వాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అని రవితేజ చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రో, కొన్ని ఫన్నీ సన్నివేశాలు,సాంగ్స్ ని ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత రవితేజ ఇన్కమ్ టాక్స్ అధికారిగా రైడింగ్ మొదలవుతుంది. 

 

ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే రవితేజ వెనకడుగు వేయని అధికారిగా కనిపిస్తున్నాడు. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ ఫుల్ అని నిరూపిస్తా అంటూ రవితేజ ఛాలెంజ్ చేసే డైలాగ్ అదిరిపోయింది. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉంది. 

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుదర్శన్, సత్య లాంటి కమెడియన్లు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios