మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ ఎవరి సినిమాలో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు..? 

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడో అన్నయ్య సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సినిమా వచ్చిన 22 ఏళ్ల తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా ప్రపోజల్ వచ్చింది. ఇది రూమర్ గానే ఉన్నా.. నిప్పు లేనిదే పొగరాదుకదా.. అందుకే మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబో మూవీపై ఇండస్ట్రీలో డిస్కర్షన్ నడుస్తోంది. 

 ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను చేస్తూ యువ హీరోల‌కు పోటీనిస్తున్నాడు చిరంజీవి. ఈయ‌న న‌టించిన ఆచార్య‌ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కోర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ కూడా స్క్రీన్ శేర్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు దీనితో పాటు మ‌రో నాలుగు సినిమాలు సెట్స్ ఎక్కించారు మెగాస్టార్. 

గాడ్ ఫాదర్, భోళాశంకర్ తో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఇక వెంకీ కుడుములాతో కూడా ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు చిరు. బాబీ డైరెక్షన్ లో తెర‌కెక్క‌తున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో మాస్‌రాజ ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నట్లు ఎప్పటి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. 
ఇక మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. 

టాలీవుడ్ లో అందుతున్న‌స‌మాచారం ప్ర‌కారం ఈ ఏప్రిల్‌లో ర‌వితేజ మెగాస్టార్ మూవీ షూటింగ్లో పాల్గొంటాడ‌ని తెలుస్తుంది. ర‌వితేజ కూడా ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నాడు. అన్న‌య్య సినిమా త‌ర్వాత మ‌ళ్లీ వీళ్లీద్ద‌రూ క‌లిసి న‌టిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. 

మెగాస్టార్ జోడీగా శృతి హాస‌న్ నటించబోతున్నట్టు ఈ మధ్య ప్రకటించారు టీమ్. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య టైలిల్ పరిశీలనలో ఉంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ముంబయ్ లో ఉన్నారు. గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం ముంబయ్ వెళ్లారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గోంటున్నారు. వారంపాటు ఈ షూటింగ్ ముంబయ్ లోని ఎన్డీ స్టూడియోలో జరగబోతోంది. అప్పటి వరకూ మెగస్టార్ కు తన ఫామ్ హౌస్ లో ఆతిథ్య ఇచ్చారు సల్మాన్ ఖాన్.