Asianet News TeluguAsianet News Telugu

మాస్ మహారాజ్ మెచ్చిన సుధీర్ వర్మ, రవితేజ నుంచి మరో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్...?

వరుస ప్రాజెక్ట్ లతో దూకుడు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రావితేజ. ఒకటి కంప్లీట్ కాకముందే మరోకటి స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు  లైన్ లో పెట్టిన మాస్ మహారాజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాట. 
 

Ravi Teja Doing one More Movie with Sudheer Varma
Author
First Published Sep 8, 2022, 1:32 PM IST

 ప్రస్తుతం ధమాకా హడావిడిలో ఉన్నాడు రవితేజ... ఈ సినమా షూటింగ్ కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు సుధీర్ వర్మతో 'రావణాసుర' ప్రాజెక్టును కూడా పరిగెత్తిస్తున్నాడు.సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న  రావణాసుర సినిమాని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈసినిమా నిర్మాణంలో మాస్ మహారాజ్ కూడా ఓ చేయి వేస్తున్నాడు.  ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ.. షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.  

ఇక ధమాకా విషయంలో కాస్త గుస్సగా ఉన్న రవితేజ.. రావణాసుర విషయంలో మాత్రం దిల్ ఖుష్ గా ఉన్నాట. ఈ సినిమాను స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా సుధీర్ వర్మ రూపొందిస్తున్నాడు. ఆయన స్టోరీ లైన్ తో పాటు.. కథను  తయారు చేసుకునే తీరు...దానికి తగ్గ స్క్రీన్ ప్లే తో పాటు.. దానిని ఆయన మెయింటేన్ చేసుకునే విధానం.. ఎక్కువగా ఖర్చు కాకుండా.. షూట్ చేస్తున్న విధానం.. బడ్జెట్  విషయంలో ప్లానింగ్.. ఇలా అన్నీ చూసి చాలా ఇప్రెస్ అయ్యాడట రవితేజ.  అంతూ రాదే ఈ విషయంలో సుధీర్ ను బాగా మెచ్చుకున్నాడట కూడా. 

 అంతే కాదు ఇన్ని విషయాలలో తనను ఇంప్రెస్ చేసిన సుధీర్ వర్మకు రవితేజ  మరో ఛాన్స్ ఇచ్చాడని టాక్ టాలీవుడ్ లో గట్టిగా నడుస్తోంది. రావణాసుర సినిమా  షూటింగు గ్యాపులోనే రవితేజకి సుధీర్ వర్మ ఒక కథ చెప్పడం  .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంకూడా జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం రవితేజకు ఉన్న రెండు మూడు.. కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత, మళ్లీ  సుధీర్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని  తెలుస్తోంది. ఇక వీరిద్దరికాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న రావణాసుర వచ్చే ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios