Asianet News TeluguAsianet News Telugu

రవితేజ, నాని సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం.. టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్‌ ?

మాస్‌ మహారాజా రవితేజ, నేచురల్‌ స్టార్‌ నాని టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. వీరిద్దరు కలిసి తమ ఈగోలను పక్కన పెట్టి ఓ అరుదైన సంఘటనకు తెరలేపారట. 
 

ravi teja and nani combined promotion for their ravanasura dasara movies
Author
First Published Mar 19, 2023, 5:00 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పటి వరకు తాను నటిస్తున్న సినిమాల జోనర్‌ని పక్కన పెట్టి, కొత్త పంథాని ఎంచుకున్నారు. పూర్తి రగ్గ్ డ్‌, రా అండ్‌ రస్టిక్‌ మూవీ చేస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల దీనికి దర్శకత్వం వహించారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు నాని. లక్నో, వైజాగ్ తో పాటు ఇతర ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నారు. ఈ నెల 24, లేదంటే 26న ఈ చిత్రప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారని సమాచారం.

మరోవైపు వారం గ్యాప్‌తో రవితేజ థియేటర్లోకి రాబోతున్నారు. ఆయన సుధీర్‌ వర్మతో కలిసి నటించిన `రావణాసుర` చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కాబోతుంది. ఇందులో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, అను ఇమ్మాన్యుయెల్‌, మేఘా ఆకాష్‌, దక్షా నగర్కర్‌, పూజిత పొన్నాడా, ఫరియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది యూనిట్‌. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందుతుందని అర్థమవుతుంది. 

వారం గ్యాప్ తో అటు నాని, ఇటు రవితేజ సినిమాలు రిలీజ్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి ఓ కొత్త దారికి శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడం విశేషం. జనరల్‌గా దేనికదే టీమ్‌ ఇంటర్వ్యూలు, లేదంటే మెయిన్‌ కాస్టింగ్‌ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. కానీ దాన్ని బ్రేక్‌ చేసి ఇప్పుడు రవితేజ,నాని ఇద్దరు కలిసి ఒకరినికొరు ఇంటర్వ్యూ చేసుకోబోతున్నారు. ఎవరికివారు తమ సినిమా విశేషాలను పంచుకోబోతున్నారు. ఇద్దరి మధ్య అనుబంధాలను, ఇద్దరికి సంబంధించిన విశేషాలను వెల్లడిస్తూనే తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన షూట్‌ కూడా కంప్లీట్‌ అయ్యిందట. త్వరలోనే నాని, రవితేజల చిట్‌చాట్‌ వీడియోని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 

ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్న వార్త. ఇదే నిజమైతే ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని చెప్పొచ్చు. ఆ మధ్య సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణలు నటించిన `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు ఒకేటైమ్‌లో రిలీజ్‌ అయ్యాయి. రెండు సినిమాలకు నిర్మాతలు ఒక్కరే. ఆ సమయంలోనే రెండు సినిమాలు కలిపి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. చర్చ జరిగింది. కానీ అది పెద్ద స్టార్స్ తో కూడిన వ్యవహారం. అది ఆ ఇద్దరి మధ్య ఉండే అండర్‌స్టాండింగ్‌తో సాధ్యమవుతుందని భావించారు. ఇద్దరు భారీ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల సినిమాలు కాబట్టి కంబైన్డ్ ప్రమోషన్స్ సాధ్యం కాదనే చర్చ వినిపించింది. 

కానీ దాన్ని బ్రేక్‌ చేస్తున్నారు నాని, రవితేజ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిటాలీవుడ్‌కి కొత్త దారి చూపుతున్నారు. ప్రమోషన్స్ లో నయా పంథాకి శ్రీకారం చుడుతన్నారు. అంతకు ముందు `రామారావు` సినిమాకి నాని గెస్ట్ గా వచ్చాడు. ఆ టైమ్‌లో రవితేజ, నాని మధ్య ఉన్న బాండింగ్‌ ఏంటో తెలిసింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారనే వార్త ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక `అంటే సుందరానికి` చిత్రంతో పరాజయం అందుకున్నారు నాని. ఈ చిత్రంతో పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ కొట్టి రికార్డు క్రియేట్‌ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు `ధమాకా` విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రవితేజ. దీంతో `రావణాసుర` చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిల్‌ బజ్‌ రావడం లేదు. మరి ఈ కంబైన్డ్ ఇంటర్వ్యూతోనైనా ఆ క్రేజ్‌వస్తుందా అనేది చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios