Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌజ్ నుంచి రతికా అవుట్.. ఇరుక్కుపోయిన పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈవారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అశ్విని నిన్ననే ఎలిమినేట్ అవ్వగా.. ఈరోజు రతికారోజ్ ఎలిమినేషన్ ఉత్కంఠ భరితంగా మారింది.  

Rathika Rose Eliminated again from Bigg Boss Telugu 7 NSK
Author
First Published Nov 26, 2023, 10:47 PM IST

ఈ వారం ఇద్దరు హౌజ్ ను వీడాల్సి ఉంది. దీంతో సెల్ఫ్ నామినేషన్ తో అశ్వినిశ్రీ (Ashwini Sri) హౌజ్ ను వీడింది. ఈ రోజు వెళ్లిపోతూ నాగ్ తో మాట్లాడింది. తన జర్నీని స్క్రిన్ చూసిన తర్వాత హౌజ్ మేట్స్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అయితే అశ్విని నుంచి నాగ్ కొన్ని అభిప్రాయాలను సేకరించారు.ఇప్పుడు ఉన్న బ్యాచ్ లో హిట్, ఫట్ ఎవరనే దానిపై తన ఫీలింగ్ ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగ్ హౌజ్ లోని మూడు బ్యాచ్ లకు పేర్లను పెట్టారు. శోభా, ప్రియాంక, అమర్ -  స్పా/చుక్క బ్యాచ్ అని, శివాజీ, అమర్, ప్రశాంత్ -స్పై/మొక్క బ్యాచ్ అని, మిగితాది తొక్క బ్యాచ్ అంటూ హౌజ్ లోని బ్యాచ్ లపై సరదా ఫన్నీకామెంట్లు చేశారు. వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అశ్విని సెల్ఫ్ నామినేషన్ తో ఎలిమినేట్ అయ్యింది.

ఇక హౌజ్ లో .... శివాజీ, అమర్,  గౌతమ్, శోభాశెట్టి, రతిక, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ ఉన్నారు. వీరిని రెండు బ్యాచ్ లుగా ఏర్పాటు చేశారు నాగ్. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడదీశారు. వీరితో క్విజ్ పోటీని ఆడించారు. ఒక్కొక్కరికి మార్కులు అందించారు. అర్జున్  సంచాలకుడిగా ఉన్నారు. మిగితా వారు గేమ్ ఆడారు. హౌజ్ లోని వస్తువులు, ఇంటిరియర్, ఫర్నీచర్, తదితర వస్తువులపై ఉన్న కలర్ తదితర అంశాలను ప్రశ్నలుగా అడిగారు. ఈ క్విజ్ లో స్పై బ్యాచ్ గెలిచింది. ఇలా మరిన్ని గేమ్స్ తో హౌజ్ లో సందడి నెలకొంది. మంచి ఫన్ ను అందించారు. 

ఇక ఈ వారం నామినేషన్స్ లో రతికా, ప్రియాంక మినహా మిగిలిన వారందరూ నామిషన్స లో ఉన్నారు. బిగ్ బాస్ సేఫ్, అన్ సేఫ్ గేమ్ లో అమర్ దీప్, గౌతమ్ సేఫ్ అయ్యారు. తర్వాత పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు. ఆ నెక్ట్స్ యావర్, శివాజీ కూడా సేఫ్ అయ్యారు. అర్జున్ అండ్ రతికా ఇద్దరూ నామినేషన్స్ లో మిగిలారు. వీరిలో ఇంటిని ఒకరు వీడాల్సి ఉంది. ఎలిమినేషన్ కు ముందుకు పల్లవి ప్రశాంత్ తన ఎవిక్షన్ పాన్ ను వినియోగించాలని అడిగారు. కానీ పద్నాలుగో వారం వాడుతానని తప్పికున్నారు. ప్రియాంక ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. అటు అర్జున్, ఇటు ప్రియాంకకు పాస్ ను వినియోగించ లేదు. 14వ వారమే అర్హులకు వినియోగిస్తానని తన అభిప్రాయాన్ని బిగ్ బాస్ కు చెప్పారు. 

దీంతో ఫైనల్ గా రతికను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. రతికా వైల్డ్ కార్డు ఎంట్రీతో రెండో సారి హౌజ్ లో అడుగుపెట్టి ఇప్పటి వరకు గేమ్ ఆడుతూ వచ్చింది. ఇక 12వ వారంలో మళ్లీ ఎలిమినేట్ అయ్యింది. మొదట 28వ రోజుకే హౌజ్ ను వీడింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో 49వ రోజు మళ్లీ వచ్చింది. 35రోజులు హౌజ్ లో ఉండి 84వ రోజున ఎలిమినేట్ అయ్యింది. వెళ్లిపోతూ పోతూ తనమీద తనే పాటేసుకుంది. ‘ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో’ అనే సాంగ్ పాడి ఫన్ జనరేట్ చేసింది. దీంతో హౌజ్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు.  రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ జరగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios