Asianet News TeluguAsianet News Telugu

రష్మికని సినిమా నుండి తీసేశారా..? తప్పకుందా..?

తెలుగులో 'ఛలో','గీత గోవిందం' వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయిన రష్మిక ప్రస్తుతం 'దేవదాస్' సినిమాలో నటిస్తోంది. ఈ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

rashmika mandanna walked out of vritra movie
Author
Hyderabad, First Published Sep 17, 2018, 5:05 PM IST

తెలుగులో 'ఛలో','గీత గోవిందం' వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయిన రష్మిక ప్రస్తుతం 'దేవదాస్' సినిమాలో నటిస్తోంది. ఈ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొద్దిరోజులుగా తన నిశ్చితార్ధం బ్రేకప్ వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఓ సినిమా నుండి తప్పుకొని మరోసారి వార్తల్లో నిలిచింది.

తాజాగా కన్నడ సినిమా 'వ్రిత్రా' అనే సినిమా నుండి రష్మిక తప్పుకుంది. 'కన్నడలో నేను ఒప్పుకున్న 'వ్రిత్రా' అనే సినిమా నుండి తప్పుకున్నాను. ఆ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి సినిమా చేయకూడదనే కారణంతోనే సినిమా నుండి తప్పుకున్నట్లు'' తెలిపింది రష్మిక.

అయితే కన్నడనాట మాత్రం వార్తలు మరో రకంగా వినిపిస్తున్నాయి. వ్రిత్రా సినిమా దర్శకుడు, రష్మిక ప్రేమించి బ్రేకప్ చేసుకున్న రక్షిత్ శెట్టిలు మంచి స్నేహితులు. మళ్లీ పాత బంధాలు పునరుద్దించబడతాయనే కారణంతో రష్మిక కావాలనే సినిమా నుండి తప్పుకున్నట్లు వినిపిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios