Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప- ది రైజ్’ :శ్రీవల్లి గా రష్మిక,ఫస్ట్ లుక్ వచ్చేసింది, అదిరింది

ఇప్పటిదాకా సినిమాలో హీరోయిన్ రష్మిక సంభందించి అప్ డేట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
 

Rashmika as Srivalli first look unveiled
Author
Hyderabad, First Published Sep 29, 2021, 10:24 AM IST


అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప సినిమా ప్రమోషన్ కూల్ గా సాగుతోంది. అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ  పెంచేలా ఓ ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్,టీజర్ లకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటిదాకా సినిమాలో హీరోయిన్ రష్మిక సంభందించి అప్ డేట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.

ఇక ఇప్పటివరకు కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ  వచ్చిన రష్మిక.. పుష్పలో మాత్రం పూర్తిగా డీ గ్లామరైజ్డ్ గా కనిపిస్తుంది. ఇందులో శ్రీవల్లి అనే  పాత్రలో ఆమె కనిపించనుంది. అల్లు అర్జున్ భార్యగా కనిపించబోతోంది. సినిమా అంతా రాయలసీమ నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో హీరో,హీరోయిన్స్ చిత్తూరు యాస మాట్లాడనున్నారు. వాళ్లతో పాటు అనసూయ భరద్వాజ్, సునీల్ కూడా చిత్తూరు యాస మాట్లాడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.  

ఇక ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ‘రంగస్థ‌లం‌’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప- ది రైజ్’. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం ‘పుష్ప- ది రైజ్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios