బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఈ స్థాయికి ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు నిజాయితీగా ఒప్పుకుంది. వ్యక్తిగతంగా రష్మి తనకు తెలిసినవారితో ప్రేమగా ఉంటుంది.

స్నేహానికి వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు తన స్నేహితుడి కోసం ఓ ఈవెంట్ లో ఫ్రీగా పాల్గొంటుంది ఈ బ్యూటీ. వివరాల్లోకి వెళితే.. నెల్లూరుకి చెందిన 'జబర్దస్త్' కమెడియన్ కిరాక్ ఆర్పీ చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపనీ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి రష్మిని ఆహ్వానించాడు.

దీనికోసం రెమ్యునరేషన్ విషయంలో రష్మిని కాస్త ఉదారంగా ఉండాలని కోరాడట. దీంతో ఆమె ఓపెనింగ్ కోసం డబ్బులు తీసుకోనని ఫ్రీగా చేసి పెడతానని మాట ఇచ్చిందట. నిజానికి రష్మి కాల్షీట్స్ కావాలంటే లక్షల్లో రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 'జబర్దస్త్' షోకి నెలకు నాలుగు ఎపిసోడ్ లకు అమ్మడు రెండు లక్షల పారితోషికం తీసుకుంటుంది.

ఇక బయట ఈవెంట్స్ కోసం రెండు నుండి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తుంటుంది. అలాంటి తన స్నేహితుడు కిరాక్ ఆర్పీ కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదే విషయాన్నీ ఆర్పీ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. రష్మి స్వభావాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడట.