Asianet News TeluguAsianet News Telugu

రంగ రంగ వైభవంగా ఫస్ట్ డే కలెక్షన్స్... వైష్ణవ్ కి బిగ్ షాక్!

ప్లాప్ టాక్ తెచ్చుకున్న రంగ రంగ వైభవంగా మూవీ కలెక్షన్స్ అంతే దారుణంగా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ranga ranga vaibhavamga first day collections big shock to vaishnav
Author
First Published Sep 3, 2022, 6:00 PM IST

గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్- కేతిక శర్మ హీరో హీరోయిన్స్ గా ఆగస్టు 2న విడుదలైన రంగ రంగ వైభవంగా ఫస్ట్ డే దారుణమైన వసూళ్లు రాబట్టింది. అసలు జనాలు ఈ సినిమాను పట్టించుకోలేదని క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రమోషన్స్ సరిగా నిర్వహించకపోవడంతో జనాల్లోకి సినిమా వెళ్ళలేదు. ఈ కారణంగా సినిమాపై ఏమాత్రం హైప్ ఏర్పడలేదు. దానికి తోడు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. 

ఫస్ట్ డే రంగ రంగ వైభవంగా కేవలం రూ. 1.07 కోట్ల షేర్ అందుకుంది. ఇది వైష్ణవ్ గత చిత్రం కొండపొలం కంటే తక్కువ కావడం విశేషం. ఆ మూవీ కనీసం రూ. 1.3 కోట్ల ఫస్ట్ డే షేర్ రాబట్టింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోటి రూపాయల షేర్ దాటలేకపోయిందంటే చెప్పొచ్చు సినిమా పరిస్థితి ఎలా ఉందో. నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్ లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షల షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 96 లక్షల షేర్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. 

రంగ రంగ వైభవంగా రూ. 8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 9 కోట్లు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగిన రంగ రంగ వైభవంగా నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు ఫస్ట్ డే ఫస్ట్ షో, రంగ రంగ వైభవంగా నిరాశపరిచాయి. 

ఏరియా వారీగా రంగ రంగ వైభవంగా వసూళ్ల వివరాలు...

 నైజాం: 31 లక్షలు
సీడెడ్: 10 లక్షలు 
UA: 12 లక్షలు
తూర్పు: 9 లక్షలు 
పశ్చిమ: 6 లక్షలు 
గుంటూరు: 16 లక్షలు 
కృష్ణ: 7 లక్షలు 
నెల్లూరు: 5లీ
AP-TG మొత్తం:- 0.96కోట్లు(1.65 కోట్ల ~ గ్రాస్ )
కకర్ణాటక+ROI : 4 లక్షలు 
ఓవర్సీస్ - 7 లక్షలు
మొత్తం WW: 1.07కోట్లు(1.90 కోట్ల ~ గ్రాస్ )

Follow Us:
Download App:
  • android
  • ios