Asianet News TeluguAsianet News Telugu

'రంగమార్తాండ' మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే?

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Ranga Marthanda movie release date announced
Author
First Published Mar 16, 2023, 6:38 PM IST

సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్, సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరాఠిలో తెరకెక్కిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు రీమేక్ గా వస్తోంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ నీ ప్రకటించారు.

తాజా అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అప్డేట్ అందించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. 'రంగమార్తాండ' నుంచి ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు రీసెంట్ గా చిత్ర యూనిట్ ఫస్ట్ కాఫీని కూడా చూసినట్టు తెలుస్తోంది. చిత్రం కంటతడి పెట్టిస్తుందనీ దర్శకుడు తేజ కామెంట్స్ చేయడం సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన షాయరీని స్వయంగా తన గొంతుతో పాడారు. ఈ సాంగ్ లోని లిరిక్స్ మనస్సును కదిలించేలా ఉన్నాయి.. ‘నేనొక నటుడిని’ అంటూ సాగే కవిత్వం మెగా కంఠంతో మరింతగా ఆకట్టుకుంది. దీంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తో పాటు రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios