Asianet News TeluguAsianet News Telugu

#Animal కలెక్షన్స్ సునామీ, ఫస్ట్ డే లెక్కలు

 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 95 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కడితే 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్  వచ్చి ఉంటుందని అంచనా. 

Ranbir movie Animal Day 1 storm hits Indian box office jsp
Author
First Published Dec 2, 2023, 7:46 AM IST


 బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే... ‘యానిమ‌ల్‌ (Animal movie). కొన్నాళ్లుగా ఎక్క‌డ చూసినా ఈ సినిమా  గురించిన వార్తలే. ట్రైలర్ తో ఈ సినిమా మ‌రిన్ని అంచ‌నాల్ని, ఆస‌క్తిని రేకెత్తించింది.నిన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఫస్టాఫ్, ముఖ్యంగా ఇంట్రవెల్ అదిరిపోయింది..దానికి డబ్బులు ఇచ్చి వచ్చేయవచ్చు అంటున్నారు రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారనేదే హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై పెరిగిన ఎక్సపెక్టేషన్స్ కు తగినట్లుగా ఫస్ట్ డే ఓపినింగ్స్ సునామీలా వచ్చాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కల ప్రకారం ప్రకారం  తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందు రోజు గ్రాస్ బుకింగ్స్ తోనే 4.5 కోట్ల దాకా బుకింగ్స్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ముందు రోజు 40 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను అందుకుంది. మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా… 10 కోట్ల దాకా  గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుందని చెప్తున్నారు. ఇక హిందీతో కలిపి ఇండియాలో సినిమా ప్రస్తుతం నడుస్తున్న  ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు 56-60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ముఖ్యంగా పంజాబ్ బెల్ట్ లో అయితే మామూలుగా లేదు.   ఓవర్సీస్ లో సినిమా 4 మిలియన్ డాలర్స్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకుంది. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 95 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కడితే 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్  వచ్చి ఉంటుందని అంచనా. అయితే ఇవి ట్రేడ్ లో చెప్పుకుంటున్న లెక్కలు మాత్రమే. అఫీషియల్ మాత్రం కాదు.
 
సాధారణంగా మాస్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావుంటాయి. 'యానిమల్'కు మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం బావున్నాయి. పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో రెండున్నర లక్షల టికెట్స్ అమ్మారు. కేవలం వాటి ద్వారా సుమారు ఏడున్నర కోట్ల వరకు వచ్చాయి.  ఒక్క హైదరాబాద్ సిటీలో ఫస్ట్ డే కలెక్షన్స్ మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయని టాక్. 

ఇక  యానిమల్ కు డివైడ్ టాక్  కనిపిస్తోంది.  కొంతమందికి పిచ్చ పిచ్చ నచ్చేయగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్   చెప్తున్నారు.టాక్  ఎలా ఉన్నా వీకెండ్ మూడు రోజులు భీబత్సం సృష్టిస్తోంది. నిన్నైతే దేశవ్యాప్తంగా చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ  ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి.   తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు అయ్యాయి. సందీప్ వంగా తెలుగువాడు అవటంతో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫాస్ట్ అదిరిపోయాయి.
 
 యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios