Asianet News TeluguAsianet News Telugu

Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ మెడపై టాటూ సీక్రెట్, బాలయ్యతో షేర్ చేసుకున్న బాలీవుడ్ హీరో..

రణ్ బీర్ కపూర్ మెడపై  టాటూ.. ఫస్ట్ టైమ్ తన టాటూ గురించి చెప్పాడు బాలీవుడ్ హీరో.. అది కూడా మన బాలయ్య షోలో.. అసలు విషయం  సంగతి చెప్పడంతో పాటు.. ఆమె అంటే ఎంత ఇష్టమో వెల్లడించాడు. 

Ranbir Kapoor Tattoo On his Neck Secret share with Balayya JMS
Author
First Published Nov 26, 2023, 8:08 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. డిసెంబర్ 1న ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. ఇప్పటి వరకూ ఆడియన్స్ రణ్ బీర్ ను లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, రొమాంటిక్ హీరో, ప్లే బాయ్ లాంటి ఇమేజ్ లోనే చూసి ఉన్నారు. కాని ఫస్ట్ టైమ్ రణ్ బీర్ ఈసినిమాతో తనలో మాస్ కోణాన్ని చూపించబోతున్నాడు. రగ్డ్ అండ్ రఫ్ లుక్ లో రణ్ బీర్ ను ఇప్పటికే యానిమల్ ప్రమోషన్ వీడియోస లో చూసి.. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. 

ఈమూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎక్కడ ఛాన్స్ వదలకుండా.. గట్టిగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు టీమ్ అంతా. అర్జున్‌ రెడ్డి  ఫేమ్ సందీప్ రెడ్డి వంగా  డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీలో రణ్ బీర్ జోరీగా రష్మిక మందన్నా నటించింది. ఇక ఈ పై ఆడియెన్స్‌ ఏ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.

అయితే ఈ మూవీ తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, రష్మికలతో పాటు రణ్‌బీర్ కపూర్ లు బాల‌కృష్ణ‌ అన్‌స్టాపబుల్ షోకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్ ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ఫ‌న్నీగా సాగడంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్‌లోని ఒక సీన్‌లో టాటూల గురించి చ‌ర్చ రాగా.. రణబీర్ కపూర్ తన మెడపై ఉన్న టాటూను చూపించారు. 

 

అయితే అంతా తన మెడపై ఉన్న టాటూ..ఆలియాది అయ్యిఉంటుందా..? లేక ఇంకా ఎవరైనా అమ్మాయిదా అన్నఆలోనలో ఉండగా.. ఆ టాటూ.. తన కుమార్తె పేరు రాహాది అని వెల్లడించాడు రణ్ బీర్. తన గారాల కూతురు పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలిపాడు.. అంతే కాదు తన కూతురంటే ఎంత ఇష్టమో రణ్ బీర్ వెల్లడించాడు. దాంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైర‌ల్‌గా మారింది. రణ్ బీర్ ను సోషల్ మీడియాలో తెగ మెచ్చుకుంటున్నారు. అంతే కాదు.. అతని ప్రేమకు ఫిదా అవుతున్నారు జనాలు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios