మంచి మనసు చాటుకున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్. తాను చేస్తున్న సినిమా కోసం రెమ్యూనరేషన్ నుంచి సగం వదులుకోవడానికి కూడా సై అన్నాడు. ఇంతకీ ఆ కథేంటంటే..?  


బాలీవుడ్‌లో ప్లే బాయ్ గాపేరు తెచ్చుకున్న రోమాంటిక్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను డైరెక్టర్స్‌ డ్రీమ్‌ హీరో అని కూడా అంటుంటారు. ఎందుకంటే రణ్‌బీర్‌ కపూర్‌ ఒక్కసారి కమిట్‌మెంట్‌ ఇచ్చాక.. డైరెక్టర్‌ ఏది చెబితే అది చేస్తాడట, సినిమా కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాడట. కాగా తాజాగా మరోసారి తన మంచి తనం, సినిమా మీద తనకు ఉన్న కమిట్ మెంట్ ను చాటుకున్నాడు రణ్ బీర్. ప్రస్తుతం తాను నటిస్తున్న యానిమల్ సినిమా కోసం ఓ గొప్ప పని చేశాడట. అదేంటం ఇంతకీ ఏంటా పని. 

 రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్‌ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌లో సగం వెనక్కు ఇచ్చేశాడట. అది కూడా వాళ్లకు డబ్బు తక్కువై కాదు.. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ క్వాలిటీ పెంచడానికి తన రెమ్యునరేషన్‌ను సగానికి తగ్గించుకున్నాడట. సినిమా హిట్టయి భారీ లాభాలు తెచ్చిపెడితే.. అందులో అప్పుడు షేర్‌ను తీసుకుంటా అన్నాడట. ఒక వేళ సినిమా హిట్ అవ్వకపోతే.. ఆ డబ్బు ఆయన వదులుకున్నట్టేగా.. ఇలా తాను చేస్తున్న సినిమా రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడం అంటే సినిమాపై ఆయనకున్న ప్రేమ, నిజాయితీలు అర్దం అవుతున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. 

మన టాలీవుడ్ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. కాస్త పద్దతిగా తెలుగు సినిమా నడుస్తున్న టైమ్ లోనే.. అర్జున్ రెడ్డితో.. హాట్ బాంబ్ విసిరిన సందీప్.. ఇక అసలు.. అసలు బార్డర్‌లు లేని బాలీవుడ్‌లో యానిమల్‌తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోఆత్రుత ఉప్పొంగుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్‌ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్‌ చేసి చిన్నపాటి విధ్వంసమే సృష్టంచాడు.

తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్‌ను డీప్‌గా చూపించబోతున్నట్లు టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు. సాత్వికంగా ఉండే రణ్‌బీర్‌ కొన్ని కారణాల వల్ల జంతువులా మారి శత్రువులను చీల్చీ చెండాడుతూ ఉంటాడు. క్రిమినల్‌ను కన్నామంటూ అనీల్‌ కపూర్‌తో రణ్‌బీర్‌ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పించాడు. కొన్ని షాట్స్‌ అయితే ప్యూర్‌ గూస్‌బంప్స్‌ స్టఫ్‌లానే అనిపించాయి. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది.