బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కొంతకాలం పాటు రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు రణబీర్ కపూర్.. అలియాభట్ తో డేటింగ్ లో ఉన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక దీపికా.. రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. రణబీర్ తో బ్రేకప్ అయిన తరువాత అతడితో కలిసి సినిమాలు చేసింది దీపికా. అయితే మొన్నామధ్య దీపికా.. రణబీర్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ కామెంట్స్ చేసింది.

అప్పటినుండి వీరిద్దరికీ మధ్య పొసగడం లేదు. రణబీర్ ఎవరికీ అర్ధం కాడని, ఏ టైమ్ లో ఎలా ఉంటాడో.. ఏం ఆలోచిస్తాడో ఎవరికీ తెలియదని. తనకు ఫీలింగ్స్ బయట పెట్టడం రాదని.. ఇప్పటికైనా నేర్చుకుంటాడని భావిస్తానని చెప్పింది దీపికా.

తాజాగా రణబీర్ ని దీపికా యాక్టింగ్ స్కిల్స్ మీద మీ కామెంట్ ఏంటి..? అని ప్రశ్నించగా.. నాకు పెద్దగా నచ్చదు.. ఆమెని చూస్తే కామెడీగా అనిపిస్తుంటుందని సంచలన కామెంట్స్ చేశాడు.