Asianet News TeluguAsianet News Telugu

#Animal:‘యానిమల్’ OTT దెబ్బేసారే,ఫ్యాన్స్ డీలా

ఈ సినిమా చూసిన వారు సైతం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. అందుకు కారణం ఉంది..

Ranbir Kapoor #Animal OTT release with out extended cut jsp
Author
First Published Jan 26, 2024, 3:19 PM IST


 బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌' ఓటిటి లో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారు. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది.  ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు సైతం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూసారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. అందుకు కారణం ఉంది..

నెట్ ఫ్లిక్స్ లో తాజాగా రిలీజైన ఓటీటి వెర్షన్ లో ఎగస్ట్రా తొమ్మిది నిమిషాల ఫుటేజ్ ఉంటుందని ముందు నుంచి జరిగిన ప్రచారానికి భిన్నంగా మనం తెరపై చూసిన సెన్సార్ కాపీనే ఉంది.   ఒకటి రెండు షాట్స్ మినహాయించి ఎలాంటి అదనపు సన్నివేశాలు లేవని అంటున్నారు.  దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా ఎడిట్ చేస్తున్నానని, అవి ప్రేక్షకులను మరింత సర్ప్రైజ్ చేస్తాయని చెప్పాడు. దీని కోసమే ఆసక్తి  పెంచుకున్న వాళ్ళు నిరాశకు గురి అయ్యారు.  అందుకు కారణం .. ఇండియాలో సెన్సార్ చేసిన కంటెంట్ ని మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. 
 
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రణబీర్ కపూర్, విలన్ బాబీ డియోల్ మధ్య ఇంటెన్స్ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్.. చాలామంది యాక్షన్ మూవీ లవర్స్‌ను కట్టిపడేసింది. అయితే ఆ సీన్ మధ్యలో బాబీ డియోల్.. రణబీర్ కపూర్‌ను ముద్దుపెట్టుకున్నానని, కానీ అది థియేటర్లలో విడుదల చేయలేదని, ఓటీటీ వర్షన్‌లో ఆ సీన్స్ ఉండే అవకాసం ఉందని సందీప్ బయిటపెట్టాడు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటికు రిలీజ్ కోసం ఎదురుచూసారు. 
 

యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios