Asianet News TeluguAsianet News Telugu

హాసన్ సిస్టర్స్ తో రానా చిల్ అవుట్...!

హీరో రానా దగ్గుబాటి, చెల్లెలు అక్షరా హాసన్ తో శృతి హాసన్ కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.శృతి సిస్టర్స్ ని రానా ఎక్కడ, ఎందుకు కలిశారు అనేది ఆసక్తికరంగా మారింది. 

rana daggubati with shruti haasan and her sister guys chilling out
Author
Hyderabad, First Published Sep 17, 2021, 8:37 AM IST

హీరోయిన్ శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోలు పంచుకున్నారు. హీరో రానా దగ్గుబాటి, చెల్లెలు అక్షరా హాసన్ తో ఆమె కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ముగ్గురు కలిసి పార్టీలో చిల్ అవుతున్నట్లు, ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. మంచి మనుషులు, మంచి రోజులతో సమానం. ఈ రోజు చాలా అందంగా మారింది. నచ్చిన వ్యక్తులతో సరదాగా గడపడం, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. అంటూ సదరు ఫోటోలకు ఆమె కామెంట్ ఇచ్చారు. 


అసలు శృతి సిస్టర్స్ ని రానా ఎక్కడ, ఎందుకు కలిశారు అనేది ఆసక్తికరంగా మారింది. శృతి కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటున్నారు. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోనే రానా ఈ హాసన్ సిస్టర్స్ ని కలిసి ఉండే అవకాశం కలదు. ఇక రానా నటించిన విరాట పర్వం మూవీ విడుదలపై సందిగ్దత కొనసాగుతుంది. షూటింగ్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వస్తుండగా, విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడం లేదు. 


ఇక శృతి ప్రభాస్-ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. సలార్ మూవీ సమ్మర్ కానుకగా, 2022లో ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios