నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.

నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నాగార్జున హీరో నానిని ఉద్దేశిస్తూ..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''సమయమంతా ఫోన్ లోనే గడిపేస్తాడు.. ఏం చూస్తాడో ఆ ఫోన్ లో నాకు తెలియదు. పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చున్నా కూడా చూడడు. ఆ ఫోన్ నే చూస్తూ ఉంటాడు. ఏంటో నాకు తెలియదు'' అంటూ నాగ్ చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన హీరో రానా.. ''నేను దీన్ని అంగీకరిస్తాను'' అంటూ తెలుపగా.. అది చూసిన నాని 'నీ..' అంటూ తిడుతూ సిగ్గుపడుతున్నా ఎమోజీలను పోస్ట్ చేశాడు.

దీనికి రానా 'నెక్స్ట్ టైమ్ మనం కలిసినప్పుడు నీ ఫోన్ తో పిక్ తీసి పోస్ట్ చేస్తా' అని అన్నాడు. వీరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ చాలా సరదాగా సాగింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన 'దేవదాస్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…