మనకి సంక్రాంతి, దసరాలకు సినిమాలకు సంభందించిన ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లు ఎలా రిలీజ్ అవుతాయో...నార్త్ లో రంజాన్ కు ఆ తరహా ఉత్సవం కనపడుతూంటుంది.సల్మాన్ వంటి స్టార్స్ రంజాన్ రిలీజ్ లు పెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతూంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాహుబలి తర్వాత మరోసారి ప్యాన్ ఇండియాకు ట్రై చేస్తున్న ప్రభాస్...రంజాన్ స్పెషల్ కానుక తన అభిమానులకు ఇవ్వటానికి రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. కరోనా తో ఏ సినిమాకు అప్ డేట్స్ ఉండటం లేదు. రిలీజ్ డేట్స్ చెప్పలేని పరిస్దితి. లాక్ డౌన్ తో రిలీజ్ లు లేవు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు చూస్తాం అని ఫ్యాన్స్ ఎదురుచూపుల్లో గడిపేస్తున్నారు. 

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఓ అడుగు ముందుకేసి  ప్రొడక్షన్ హౌస్ యువి క్రియోషన్స్ ని ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తో  ట్రెండింగ్ చేసారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రంజాన్ కు ఫ్యాన్స్ ఆనందపడేలా ఓ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేద్దామని ప్రభాస్ ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. ఈ మేరకు టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ గా అధికారిక సమాచారం ఏమీ లేదు. మీడియాలో వినపడుతున్న వార్తే ఇది. 

ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి  నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పటి నుంచి అనేది మాత్రం తెలియరాలేదు. అయితే  ఈ సినిమాను కూడా తన గత చిత్రాల మాదిరిగానే హిందీలోనూ విడుదల చేయబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్. అందుకోసం ఈ ప్రాజెక్టుకు కూడా భారీగా బడ్జెట్ కేటాయించారు. మొదట తెలుగులో మాత్రమే తీయాలనుకున్నా.. ‘సాహో'కు హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూసి.. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.  మిగిలిపోయిన షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా నగరాన్ని పోలిన భారీ సెట్ వేయబోతున్నారట. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేసేందుకే యంగ్ రెబెల్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.