ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.... శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న 'సలార్'  ఇప్పటికే  ఓ షెడ్యూల్‌ గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకొంది. అయితే సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాపై రోజుకో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఓ రెండు వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి గనక నిజమైతే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు న్యూస్ లు ఏమిటి అంటే..

 ఈ చిత్రంలో రమ్యకృష్ణ  ప్రభాస్‌ అక్కగా  నటించనునే వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే ఇది కన్నడ మీడియా నుంచి వచ్చిన వార్త. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అలాగే ప్రభాస్ 'సలార్'లో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ప్రభాస్ ను డ్యూయల్ రోల్స్ లో చూపించి ఆయన అభిమానులను థ్రిల్ చేయనున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్,స్పెషల్ లుక్ ను రూపొందించడానికి  ప్రోస్తెటిక్, మేకప్ బృందాన్ని రంగంలోకి దించనున్నారట మేకర్స్. ఈ రెండు వార్తలు గనుక నిజమైతే 'సలార్'పై భారీగా అంచనాలు పెరిగిపోతాయి. 

2022లో విడుదల కానున్న భారీ సినిమాల్లో 'సలార్' కూడా ఒకటి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగండూర్‌ సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్‌ గౌడ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.