అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి వరుసగా ట్వీట్లు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల నుండి కామెంట్స్ చేయడం తగ్గించాడు. ఇప్పుడు మరోసారి పవన్ అభిమానులను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమానిగా లార్డ్ బాలాజీని వేడుకుంటున్నానని, నాదెండ్ల మనోహర్ వాళ్ల నాన్న.. సూపర్ స్టార్ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచినట్లుగా, పవన్ కళ్యాణ్ ని మనోహర్ వెన్నుపోటు పొడవకూడదని.. పవన్ అభిమానులు ఈ విషయంపై పవన్ తో మాట్లాడాలని అన్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ పక్కన ఉండి నాదెండ్ల మనోహర్ తండ్రి ఎలా నవ్వేవాడో, ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ కూడా అలానే నవ్వుతున్నాడని దీని గురించే తను ఆందోళన చెందుతున్నట్లు పవన్ కు మీరైనా జాగ్రత్తలు చెప్పండి అంటూ పవన్ అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఎంత పెద్ద స్టార్ అయినా.. వెన్నుపోటు నుండి ఎన్టీఆర్ కాదు కదా.. పవన్ కళ్యాణ్ కూడా తప్పించుకోలేడని వర్మ అన్నాడు. పవన్ అభిమానిగా తాను ఎంతో ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించాడు.

పవన్ ని వెన్నుపోటు పొడవడానికి నాదెండ్ల మనోహర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలతో పాటు నేరుగా నాదెండ్ల మనోహర్ ఇంటి సభ్యుల నుండి కూడా తనకు సమాచారం అందుతోందని వర్మ అన్నాడు. మరి దీనిపై పవన్ కానీ, ఆయన అభిమానులు కానీ స్పందిస్తారేమో చూడాలి!