Asianet News TeluguAsianet News Telugu

శంకర్ సినిమాకు గ్యాప్ రావడంతో... లోకేష్ సినిమాపై హోమ్ వర్క్ చేస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హోమ్ వర్క్ మొదలు పెట్టాడట. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఏం చేస్తే బాగుంటుందో.. పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడట. శంకర్ మూవీకి గ్యాప్ రావడంతో.. లోకేష్ పై కన్నేశాడట చరణ్. 

Ram Charan with Lokesh Kanagaraj Movie Update
Author
First Published Sep 1, 2022, 1:32 PM IST

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు లోకేష్ కనగరాజ్. స్టార్ హీరోలు కూడా ఈ డైరెక్టర్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ లో లోకేశ్ కనగరాజ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు.. వరుసగా సక్సెస్ లు సాధిస్తూ దూసుకుపోతున్నాడు లోకేష్. వరుసగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడంతో ఆయన డిమాండ్  అమాంతం పెరిగిపోయింది. 

 ప్రస్తుతం ఆయన దళపతి  విజయ్ దళపతి తో  సినిమా చేస్తున్న లోకేష్ కనకరాజ్ తో.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తన నెక్స్ట్ మూవీ ఉండేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో  ఈ సినిమా రూపొందుతోంది. తరువాత సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయ్యాలి అనేది చరణ్ భావన. అందుకే ఇప్పటి నుంచే ఈ  సినిమాపై కసరత్తు స్టార్ట్ చేశాట. 

ఇక ఆ  మధ్య విక్రమ్ సక్సెస్ సెలబ్రెషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు లోకేష్. తెలుగులో తన  ఫస్టు మూవీ చరణ్ తో ఉండొచ్చునని లోకేశ్ అన్నారు. ఆయన ఇప్పటికే  చరణ్ కి కథ చెప్పాడట. అయితే రామ్ చరణ్ మాత్రం ముందు ఆలోచించినా.. విక్రమ్ సినిమా హిట్ తరువాత లోకేష్ తో సినిమాచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు సమాచారం. అందులోనూ.. చరణ్ తో లోకేష్ కి  మంచి సాన్నిహిత్యం ఉంది. 

అయితే లోకేష్ కనగరాజ్ లిస్ట్ లో  ఖైదీ 2, విక్రమ్ 2  సినిమాలు ఉన్నాయి.. అయితే ఆ సినిమాలకంటే ముందు, చరణ్ తో లోకేష్ సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ సినిమా కు గ్యాప్ వచ్చింది చరణ్ కు. శంకర్ ఇండియన్ 2 సినిమా రీ స్టార్ట్ చేయడంతో.. చరణ్ కాస్త వెయిట్ చేయాల్సి వస్తుంది.. ఈ గ్యాప్ లో లోకేష్ సినిమాకు సంబంధించినవి ఫైనల్ చేయాలని కసరత్తు మొదలు పెట్టాడట రామ్ చరణ్. అయితే ఈ మధ్యలో చరణ్ అనౌన్స్ చేసిన  గౌతమ్ తిన్ననూరి  ప్రాజెక్టు పరిస్థితి ఏంటీ..? అది ఎప్పుడు చేస్తారు అనేది చూడాలి. లోకేష్ కనగరాజ్ తో సినిమాకోసం చరణ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios