తాజాగా ఉపాసన కొణిదెల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజైనర్ దుస్తులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌, డిఫెక్టెడ్‌ కండోమ్స్‌ రూపొందించిన ఓ డిజైనర్‌ వేర్‌ను ధరించిన ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది ఉపాసన కొణిదెల.

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్యగా అభిమానులకు చేరువైంది ఉపాసన కొణిదెల. మెగా కోడలిగానే అపోలో సంస్థలో భాగస్వామిగా కూడా ఎంతో పాపులర్ అయ్యింది ఉపాసన. ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గతంలో రామ్ చరణ్‌కు సంబంధించిన సినిమా అప్‌డేట్‌లు అన్ని ఉపాసన సోషల్ మీడియా పేజ్‌ల నుంచి ఇచ్చేది. అదే సమయంలో పలు సామాజిక అంశాల మీద కూడా స్పందించేది. అదే సమయంలో హెల్త్‌ టిప్స్‌ ఇస్తూ అభిమానులకు మరింతగా చేరువవుతోంది.

హెల్దీ వంటకాలు చేస్తూ ఆ వీడియోను కూడా తన ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకోవటం ఉపాసనకు అలవాటు. అంతేకాదు ఉపాసన చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్‌ కూడా వైరల్‌గా మారాయి. తాజాగా ఈమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజైనర్ దుస్తులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌, డిఫెక్టెడ్‌ కండోమ్స్‌ రూపొందించిన ఓ డిజైనర్‌ వేర్‌ను ధరించిన ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది ఉపాసన కొణిదెల.

ఆ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఉపాసన `సస్టైనబుల్ ఫ్యాషన్ అనేది ఫ్యూచర్! స్క్రాప్ ధరించడానికి ధైర్యం ఉందా..? స్థానిక డిజైనర్ల నుండి రిజెక్ట్ చేయబడిన టెక్స్ టైల్ స్క్రాప్ ల నుండి తయారు చేయబడింది. స్కర్ట్ కూడా వేస్ట్ డిఫెక్టెడ్ కండోమ్స్ తో రెడీ చేసింది` అంటూ కామెంట్‌ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View post on Instagram