మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదల చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''పరుచూరి గారి ఆలోచనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని'' చెప్పారు. సాయి మాధవ్ బుర్రా గారు ఎన్నో మంచి డైలాగ్స్ రాశారు. చాలా మంది పాత్రలు ఎలివేట్ అవ్వడానికి ఆయన డైలాగ్సే కారణమని చెప్పారు. సినిమాలో వీఎఫ్ఎక్స్అంత బాగా రావడానికి కారణం కనల్ సర్ అని అన్నారు. రత్నవేలుతో చాలా రోజులుగా జర్నీ చేస్తున్నట్లు.. ఈ సినిమాకి ఆయన పని చేయడం తమ అదృష్టమని చెప్పారు.

టెక్నీషియన్స్, నటీనటులు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు రామ్ చరణ్. సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమా కోసం పని చేసినవారందరికీ థాంక్స్ చెప్పిన రామ్ చరణ్ సక్సెస్ ఇలా ఉంటుందని అసలు ఊహించలేదని చెప్పారు. నెలరోజులుగా ఎంతో ఒత్తిడికి గురైనట్లు చెప్పారు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచేవాడినని చెప్పిన చరణ్ ఇండస్ట్రీలో నిర్మాతలంతా అలానే లెగుస్తారేమోనని నవ్వేశారు.