Asianet News TeluguAsianet News Telugu

Ram Charan : రామ్ చరణ్ న్యూ లుక్.. చెర్రీ ఇంత సింపుల్ గా కనిపించారేంటీ? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan న్యూ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. చెర్రీ ఫొటోలను వైరల్ గా మారుస్తున్నారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ ట్రెండింగ్ లోకి వచ్చింది. 
 

Ram Charan New Look Goes Viral NSK
Author
First Published Feb 13, 2024, 4:59 PM IST | Last Updated Feb 13, 2024, 4:59 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ RRRతో   అలరించారు.  ఇక నెక్ట్స్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’ Game Changerతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ చిత్రం 2024లోనే రానుంది. చిత్రానికి  నిర్మాత దిల్ రాజు  డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ చత్రం నుంచి అప్డేట్ అందుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ టచ్ తో రాబోతున్న ఈ సినిమాపై నార్మల్ ఆడియెన్స్ లోనూ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే...  రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం ఆర్సీ16 Rc16 చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ను ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు హ్యాండిల్ చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంపికచేస్తూ షాకిస్తున్నారు. ఇక చరణ్ కూడా మూవీపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఈక్రమంలో చెర్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూ హెయిర్ స్టైల్, కొంచెం గడ్డం, సన్ గ్లాసెస్, వైట్ రౌండ్ నెక్ లో సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా మెరిశారు. 

దీంతో ‘ఆర్సీ16’ కోసమే చరణ్ ఇలా మేకోవర్ అయ్యారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నయా లుక్ లో చరణ్ వింటేజ్ లుక్ కనిపిస్తోందంటున్నారు. చరణ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios