యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. 1980 కాలం, ప్రజెంట్ ని కలుపుతూ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా రణరంగం ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. 

రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ట్రైలర్ చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. శర్వానంద్ అదరగొట్టేశాడు. రణరంగం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అని చరణ్ తెలిపాడు. ప్రభాస్ కూడా రణరంగం ట్రైలర్ ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. డార్లింగ్ శర్వానంద్, రణరంగం చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని తెలిపాడు. 

1980 కాలంలో స్మగ్లింగ్ చేసే యువకుడిగా, ప్రజెంట్ లో మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ కనిపిస్తున్నాడు. సుధీర్ వర్మ తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.