Asianet News TeluguAsianet News Telugu

#RC16 బుచ్చి బాబు సినిమాలో చరణ్ సరసన ఆమెనే ఎంపిక?

వీరిద్దరి  కాంబో అయితే ప్రొపిషనల్ గా ఉంటుందని , షూటింగ్ టైమ్ లోనూ తమ పని ఈజ్ గా అయ్యిపోతుందని దర్శకుడు భావిస్తున్నారట. 

Ram Charan, Alia Bhatt to team up for #RC16 jsp
Author
First Published Jan 25, 2024, 6:33 AM IST

 రామ్ చరణ్ తన తాజా చిత్రం  గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉంటూనే.. తన నెక్ట్స్ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా.  సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కోస్తా బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఆ మధ్య డైరెక్టర్ బుచ్చిబాబే బిగ్ బాస్ తెలుగు షోలో వెల్లడించాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... రామ్ చరణ్ సరసన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ అలియాభట్ నటించబోతున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్ లో 'RRR' వచ్చి సూపర్ హిట్టైంది. దాంతో ఆమెను బుచ్చిబాబు సనా అడిగినట్లు ,డిస్కషన్స్ జరుగుతున్నట్లు వినికిడి. నిర్మాతలు ముంబై వెళ్లి ఆమెతో నెగోషియోషన్స్ చేస్తున్నారని, మాగ్జిమం ఓకే కావచ్చు అని అంటున్నారు.రెండేళ్ల క్రితం వచ్చిన  'RRR'లో చేసినప్పుడు ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, దాంతో స్క్రీన్ పై ఏ ఇబ్బంది లేకుండా ఈ జంట కెమిస్ట్రీ పండుతుందని భావించి దర్శక,నిర్మాతలు ఆమెను ఎప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. రామ్ చరణ్, అలియా భట్ కాంబో అయితే ప్రొపిషనల్ గా ఉంటుందని , షూటింగ్ టైమ్ లోనూ తమ పని ఈజ్ గా అయ్యిపోతుందని దర్శకుడు భావిస్తున్నారట. అయితే అదే సమయంలో అలియా కనుక నో చెప్తే సాయి పల్లవి ని సీన్ లోకి తెచ్చే అవకాసం ఉందంటున్నారు. 

Ram Charan, Alia Bhatt to team up for #RC16 jsp

  ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాను మార్చి రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.  మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ మేకోవర్‌లో కనిపిస్తారట. ఈ సినిమాలో రామ్ చరణ్ కోస్తా ఆంధ్రా యువకుడిగా కనిపించబోతున్నారని టాక్.  రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. 

 కాగా కన్నడ స్టార్ శివ రాజ్‌‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సెషన్స్ మొదలుపెట్టేసారట. పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేజర్ వర్క్ కంప్లీట్ అయ్యిందని మిగతా పార్ట్ వేసవి తర్వాత షూట్ చేస్తారని అంటున్నారు.  . ఈ గ్యాప్‌లో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఏదైమైనా రామ్ చరణ్ బర్త్ డే నాటికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios