Asianet News TeluguAsianet News Telugu

కొందరు నోళ్లు మూయించడానికే అలా ప్రవర్తించా: రకుల్!

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా చెలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటీవల అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంటోంది ఈ బ్యూటీ. 

rakul preet singh comments on social media issue
Author
Hyderabad, First Published Jan 21, 2019, 12:26 PM IST

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా చెలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటీవల అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంటోంది ఈ బ్యూటీ. ఇటీవల రకుల్ కురచ దుస్తులు వేసుకుందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు.

ఇది చూసిన రకుల్ సదరు నెటిజన్ తల్లిని విమర్శించింది. దీంతో కొందరు రకుల్ కి సపోర్ట్ చేయగా, మరికొందరు ఓ మహిళను కించపరుస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది రకుల్.

ఆ ఫోటోలు తన అనుమతి లేకుండా తీశారని, దానికి బాధ్యురాలినెలా అవుతానని ప్రశ్నించింది. ఆ ఫోటోకి చేసిన కామెంట్స్ తనను భాదించినట్లు చెప్పిన రకుల్ కొందరు 
నోళ్లు మూయించడానికే అలా ప్రవర్తించినట్లు క్లారిటీ ఇచ్చింది.

కామెంట్ చేసిన వ్యక్తికి కూడా కుటుంబం ఉందనేది గ్రహించాలనే కాస్త ఘాటుగా మాట్లాడినట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో సినిమాలు నిర్మిస్తారా..? అనే విషయంపై స్పందించిన రకుల్ తన దగ్గర అంత డబ్బు లేదని, కెమెరా ముందు నిలబడడానికి ఇష్టపడతానని వెల్లడించింది.  

ఆ మాట మిమ్మల్ని అంటే సైలెంట్ గా ఉంటారా..? రకుల్ ఫైర్!

ప్యాంట్ వేసుకోలేదని రకుల్ పై వల్గర్ కామెంట్స్!

 

Follow Us:
Download App:
  • android
  • ios