Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ కి వెళ్లి రకుల్ చేస్తున్న క్యారక్టర్ ఇదా? ఫ్యాన్స్ షాక్

రకుల్ ప్రీత్ సింగ్ కు సౌత్ ఇండియన్ సిని ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.

Rakul Preet Singh character in De De Pyaar De
Author
Hyderabad, First Published Apr 2, 2019, 4:47 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ కు సౌత్ ఇండియన్ సిని ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. మహేష్ ,రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె తమిళంలోనూ సూర్య, కార్తి వంటి స్టార్స్ సరసన కనిపించింది. అయితే ఇప్పుడు ఆమె హిందీలో ఓ చిత్రం చేస్తోంది. తెలుగులో కొన్ని ఆఫర్స్ ని ప్రక్కన పెట్టి మరీ అక్కడకు వెళ్లి ఆ సినిమా చేస్తోంది. అంత స్పెషల్ గా చేస్తున్న ఆ సినిమా చాలా గొప్పదై ఉంటుందని అంతా భావించారు. 

అయితే ట్విస్ట్ ఏమిటంటే..ఆమె నటిస్తోంది అజయ్ దేవగన్ ప్రక్కన ..అదీ పెళ్లైపోయి, వయస్సు మీరిన వ్యక్తికి లవర్ గా.  తెలుగులో క్యారక్టర్ అలా ఉండాలి..మేకప్ ఇలా ఉండాలి అని డిమాండ్ చేసే రకుల్ చేస్తున్న ఈ పాత్ర ఇక్కడి ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. అయితే ఆర్టిస్ట్ అన్నాక ఏ పాత్ర అయనా చెయ్యాలి కదా అని సర్ది చెప్పుకుంటున్నారు. అయితే తెలుగులో కానీ, తమిళం కానీ ఇలాంటి పాత్ర వస్తే ఆమె చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. 

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ట‌బు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రోజు అజ‌య్ దేవ‌గ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఇందులోని స‌న్నివేశాలు అభిమానుల‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఆశిష్( అజ‌య్ దేవ‌గ‌న్) మరియు అయేషా( ర‌కుల్ ప్రీత్ సింగ్‌) జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌ల‌ని ఫ‌న్నీగా ట్రైల‌ర్‌లో చూపించారు. అజయ్ (50) మరియు అయేషా ( 26) లండన్లో ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జ‌ర్నీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు.

2017లో విడుద‌లైన గోల్‌మాల్ ఎగైన్ చిత్రం నేప‌థ్యంలోనే దేదే ప్యార్ దే చిత్రం ఉంటుంద‌ని అంటున్నారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.  ‘దే దే ప్యార్‌ దే’ అనే టైటిల్‌ అర్దం ఏమిటంటే.. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం. ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ‘దే దే ప్యార్‌ దే…’ అనే సాంగ్‌ 1948లో అమితాబ్‌ బచ్చన్, జయప్రద నటించిన ‘షరాబి’ చిత్రంలోది. 

Follow Us:
Download App:
  • android
  • ios