Asianet News TeluguAsianet News Telugu

రకుల్ రచ్చ మామూలుగా లేదుగా, ఫొటోలతోనే పిచ్చెక్కిస్తోంది

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తను  చేస్తున్న యోగా విన్యాసాలతో దుమ్ము రేపుతోంది. అయితే అదంతా ఓ బాలీవుడ్ చిత్రం కోసం. అసలు ఆమె ఫిటెనెస్ చూసే ఆ పాత్ర వచ్చిందిట.ఆ  బాలీవుడ్‌ చిత్రంలో యాక్షన్‌ సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయిని అందుకోసం ప్రాక్టీస్ మొదలెట్టింది. 

Rakul practicing yoga for Marjaavaan film
Author
Hyderabad, First Published Feb 3, 2019, 9:26 AM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తను  చేస్తున్న యోగా విన్యాసాలతో దుమ్ము రేపుతోంది. అయితే అదంతా ఓ బాలీవుడ్ చిత్రం కోసం. అసలు ఆమె ఫిటెనెస్ చూసే ఆ పాత్ర వచ్చిందిట.ఆ  బాలీవుడ్‌ చిత్రంలో యాక్షన్‌ సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయిని అందుకోసం ప్రాక్టీస్ మొదలెట్టింది. అందులో భాగంగానే ఇదిగో ఇలా ఏరియల్‌ యోగా సాధన చేస్తోంది. ఏమిటిది రకుల్ ఈ విన్యాసాలు అంటే...కూల్ గా..

‘‘ఏరియల్‌ యోగా చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. నేను ఎందుకోసం ఇంతలా కష్టపడుతున్నానో నా తర్వాత బాలీవుడ్‌ చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది’’అని చెబుతోంది రకుల్‌. ఆమె ఏరియల్‌ యోగా చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ లో  హల్ చల్ చేస్తున్నాయి.  

ఈ పంజాబీ బ్యూటీ  కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగులో ఉంది.  తెలుగు ఒకే ఒక్క సినిమాలో న‌టిస్తున్నా త‌మిళంలో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. అన్న‌ద‌మ్ములు సూర్య‌(ఎన్జీకే), కార్తీ  (దేవ్ ) ఇద్దరూ ర‌కుల్‌కి ఛాన్స్ ఇచ్చారు. శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ రెండు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న దేదే ప్యార్ దే, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న మార్జ‌వాన్ చిత్రాల్లో న‌టిస్తోంది. 

రకుల్‌ మాట్లాడుతూ.. హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మర్జావాన్‌’ అనే సినిమా చేస్తున్నాను. అజయ్‌ దేవగన్‌తో ‘దే దే ప్యార్‌ దే’ పూర్తి చేశాను. ఈ సినిమాకి 80 రోజులు వర్కింగ్‌ డేస్‌ ఇచ్చాను. తమిళంలో కార్తీతో చేసిన ‘దేవ్‌’ వేలంటైన్స్‌ డేకు రిలీజ్‌ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుంది. అలాగే సూర్యగారితో ‘ఎన్‌జీకే’ పూర్తి చేశా. సమ్మర్‌లో ఈ సినిమా వస్తుంది. 

తెలుగులో కమిట్‌ అయిన ‘వెంకీమామ’ íసినిమా షూటింగ్‌ త్వరలో ఆరంభం అవుతుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కూడా ఓ సినిమా ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. హిందీ, తమిళ సినిమాలు చేయడంవల్ల తెలుగు సినిమాలు ఒప్పుకునే వీల్లేకుండా పోయింది. అయితే ఈ ఇయర్‌ తెలుగు రిలీజ్‌లుంటాయి అని చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios