Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ లుక్ లీక్.. ఫోటో వైరల్!

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Rajinikanth's Thalaivar 167 picture leaked
Author
Hyderabad, First Published Apr 5, 2019, 2:45 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రీప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా చెన్నైలో ఓ పాపులర్ స్టూడియోస్ లో రజినీకాంత్ పై ఫోటో షూట్ నిర్వహించారు.

అయితే ఆ ఫోటోని ఎవరో లీక్ చేయడంతో అది కాస్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ పై '166' అనే టైటిల్ కనిపిస్తోంది. రజినీకాంత్ గ్రే కలర్ జాకెట్ వేసుకొని గుబురు గడ్డంతో స్టైలిష్ గా కళ్లజోడు పెట్టుకొని కనిపిస్తున్నాడు.

నోటిలో సిగరెట్, చేతిలో గన్ పట్టుకున్న రజినీ గెటప్ చూస్తుంటే 'బాషా' సినిమాలో రజినీ గుర్తొస్తున్నాడు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో 167వ సినిమా కాగా.. పోస్టర్ లో మాత్రం 166 అనే టైటిల్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios