Asianet News TeluguAsianet News Telugu

నేను ఓవర్ చేస్తాను.. ఆపేయమన్నారు: రాజశేఖర్

నాకు ఓవర్ చేయటం అలవాటు చేసేసారు, కానీ దాన్ని కంట్రోలు చేసి, తగ్గించింది మాత్రం గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు. 

Rajasekhar honest speech @ Kalki Trailer Launch
Author
Hyderabad, First Published Jun 25, 2019, 9:39 AM IST

నాకు ఓవర్ చేయటం అలవాటు చేసేసారు, కానీ దాన్ని కంట్రోలు చేసి, తగ్గించింది మాత్రం గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు. అంతద్దు...ఇంత చేస్తే చాలు అనేవారు. హైఓల్టేజి చేయద్దు అన్నారు. మీరు ఆల్రెడీ ఆఫీసర్..క్యారక్టర్ ప్రకారం ఇవన్నీ మీకు కొత్త కాదు అని చెప్పి  చక్కగా చేయించారు. అలాగే ప్రశాంత్ వర్మ సైతం దాన్ని లో టోన్ లో చేయమన్నారు. ప్రక్కనున్న వాడితో ఎందుకు అరిచి మాట్లాడతారు, తగ్గించండి అని నన్ను పూర్తిగా కంట్రోలు చేసారు అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.  ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నా అన్నారు. ఆయన తాజా చిత్రం  'కల్కి' హానెస్ట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. 

రాజశేఖర్‌ కంటిన్యూ చేస్తూ ‘‘ ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు... నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. సి. కల్యాణ్‌గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’. 

నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే... ఫీల్‌ ఎలా ఉందని! ఈ సినిమాలో నేను నటించినా... నెక్ట్స్‌ ఏం వస్తుందోననేది ఊహించలేకపోయా. పోను పోను సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ కారణం ప్రవీణ్‌ సత్తారుగారు.

ఆయన నాకు ఒక మార్క్‌ సెట్‌ చేశారు. క్లాస్‌లో మనం డిస్టింక్షన్‌లో పాస్‌ అయితే... తర్వాత ఆ మార్కుల కంటే తక్కువ వస్తే అందరూ తిడతారు. ‘గరుడవేగ’తో మమ్మల్ని ప్రవీణ్‌ సత్తారుగారు ఒక లెవల్‌లో పెట్టారు. ఇప్పుడు మేం లెవల్‌కి వెళ్లాలనేది మా అందరి టార్గెట్‌.   ప్రవీణ్‌ సత్తారు పెట్టిన టార్గెట్‌ని బీట్‌ చేయాలి లేదా రీచ్‌ అవ్వాలి అనే ఆలోచనతో కష్టపడి సినిమా చేశాం. రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. ‘గరుడవేగ’తో పోలిస్తే... ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్‌కి కచ్చితంగా ‘కల్కి’ శాటిష్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందని చెప్పగలను.

యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా.’’ అన్నారు.

రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి  మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 

ఈ నెల 28న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో  జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios