Asianet News TeluguAsianet News Telugu

రాజశేఖర్ ని ఆ సమస్య ఇంకా వెంటాడుతోందా?

రాజశేఖర్ తన తాజా చిత్రం కల్కి తో భాక్సాఫీస్ వద్ద రచ్చ చేయటానికి రెడీ అవుతున్నారు. జూన్ 28న విడుదల అవుతున్న ఈ చిత్రం పై రాజశైఖర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.

Rajasekhar Face the Same Threat with Kalki
Author
Hyderabad, First Published Jun 12, 2019, 7:09 PM IST

రాజశేఖర్ తన తాజా చిత్రం కల్కి తో భాక్సాఫీస్ వద్ద రచ్చ చేయటానికి రెడీ అవుతున్నారు. జూన్ 28న విడుదల అవుతున్న ఈ చిత్రం పై రాజశైఖర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. పీఎస్ వి గరుడవేగ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం పైగా కావొస్తూండటంతో  బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ కనపడటం లేదంటున్నారు.

రాజశేఖర్ వరస పెట్టి డిజాస్టర్స్ ఇస్తున్న సమయంలో గరుడవేగ కాస్త ఆదుకుంది. వెంటనే ప్రశాంత్ వర్మ వచ్చి కల్కి ప్రాజెక్టు మొదలెట్టారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఈ సినిమాపై మంచి క్రేజ్ ని క్రియేట్ చేసాయి. అయితే ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా కేవలం దర్శకుడు ప్రతిభే అంటోంది ట్రేడ్. ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొడితే అప్పుడు రాజశేఖర్ మార్కెట్ కు ఉపయోగపడుతుందంటున్నారు. సోలోగా రాజశేఖర్ సినిమాకు ప్రత్యేకమైన బిజినెస్ అయ్యే పరిస్దితి లేదని తేల్చేస్తున్నారు. అదే కనుక ఉంటే రాజశేఖర్ ఆగిపోయిన సినిమా రిలీజ్ చేసేద్దురు అని చెప్తున్నారు. 

కల్కి సినిమా బిజినెస్ చూసి రాజశేఖర్ కు మార్కెట్ పెరిగిందనుకుంటే భ్రమే అని చెప్తున్నారు. గరుడవేగ కానీ, కల్కి కానీ డైరక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లను వాళ్లను చూసే మార్కెట్ అయ్యాయని తేలుస్తున్నారు. ఇప్పుడు కల్కిలో రాజశేఖర్ తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకుంటే తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుందని, లేకపోతే మార్కెట్ లేని పాత సమస్యే ఉంటుంద ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇందులో కొంతవరకూ అయినా నిజం లేకపోలేదు ఏమంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios