దర్శకధీరుడు రాజమౌళి చాలా కాలం తరువాత ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకోవడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్  షూటింగ్ హైదరాబాద్ లోనే ఉంటుందన్న రాజమౌళి విడుదల తేదీపై క్లారిటీ లేదు అన్నారు. ఇక అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ కి సమస్య కానుందన్న విషయంపై కూడా రాజమౌళి స్పందించారు. అలియా గొప్ప నటి, ఆ పాత్రను బాగా చేస్తుందనే నమ్మకంతో తీసుకున్నాను. సుశాంత్ ఫ్యాన్స్ వలన ఏర్పడిన వ్యతిరేకత ఆర్ ఆర్ ఆర్ కి డామేజ్ చేయదనే నమ్మకం వ్యక్తం చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మరియు అతని చిత్రాల గురించి కూడా రాజమౌళి మాట్లాడారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటని అడుగగా, ప్రభాస్ కి వేరే దారి లేదు అన్నారు. ఆయనకున్న ఇమేజ్, ఫాలోయింగ్ రీత్యా కొద్దిమందికి మాత్రమే నచ్చే కథలు చేయలేడు అన్నారు. ఇక ఆదిపురుష్ గురించి నాతో చర్చించాడని ఐతే ఆ మూవీ గురించి నేను ఏమి మాట్లాడలేను అన్నారు. 

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత చేయనున్న మహేష్ మూవీ గురించి కూడా మాట్లాడారు. మహేష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేయిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి మంచి కథ సిద్ధం చేయాలని సూచించినట్లు ఆయన చెప్పడం విశేషం. మహేష్ రాజమౌళి మొదటిసారి కలిసి మూవీ చేయనుండగా, మహేష్ కి మెమరబుల్ హిట్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుంది.