బయోపిక్ సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీసి ప్రేక్షకుల్ని కన్వీన్స్ చేయడం మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్త సినిమా ఎనౌన్స్ చేసారు. కంగారుపడకండి ఆయన దర్శకత్వంలో కాదు.. సమర్పణలో. అది కూడా ఓ బయోపిక్! ఈ రోజు ఈ సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ కోసం రాజమౌళి (SS Rajamouli)నడుం బిగించాడు. ఓ గొప్ప వ్యక్తి బయోపిక్‌ను ప్రేక్షకులకు చెప్పడానికి ప్రజెంటర్‌గా మారి తన అభిమానులకు ఆనందం కలిగించారు. ఈ బయోపిక్ మూవీని మంగళవారం ట్విట్టర్ ద్వారా అనౌన్స్‌చేశాడు రాజమౌళి. ఈ సినిమాకు మేడిన్ ఇండియా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ బయోపిక్ ను ఉద్దేశించి ట్విట్టర్‌లో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“బయోపిక్ సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీసి ప్రేక్షకుల్ని కన్వీన్స్ చేయడం మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి మా బాయ్స్ సిద్ధంగా ఉన్నారు” అని రాజమౌళి తెలిపాడు. ఈ బయోపిక్ కథ విని తాను ఎమోషనల్ అయ్యానని రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోలో పాతకాలం నాటి రీల్స్, ప్రొజెక్టర్ కనిపించడం ఇంట్రస్టింగ్ గా ఉంది.
భారతీయ సినిమా పితామహుడిగా (ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా) చరిత్రకు ఎక్కిన దాదా సాహేబ్ ఫాల్కే (Dadasaheb Phalke) బయోపిక్ ఇది. మన దేశంలో మొట్ట మొదటి ఫీచర్ ఫిల్మ్ 'రాజా హరిశ్చంద్ర'. ఆ చిత్రం తీసిన ఘనత దాదా సాహేబ్ ఫాల్కే సొంతం. 1913లో ఆ సినిమా వచ్చింది. అసలు భారతదేశంలో సినిమా ఎలా పుట్టింది? అందుకు ఫాల్కే చేసిన కృషి ఏమిటి? వంటి అంశాలతో పాటు ఆయన జీవితాన్ని 'మేడ్ ఇన్ ఇండియా'లో చూపించనున్నట్లు తెలిసింది.
'మేడ్ ఇన్ ఇండియా' చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షోయింగ్ బిజినెస్, ఎ మేజర్ మోషన్ పిక్చర్ సంస్థలపై సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరాఠీ, తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
