టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలుకాబోతుంది. టాలీవుడ్  హీరోలు అందరూ  నెలలుగా వాయిదా పడిన తమ సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభించనున్నారు. ఇక స్టార్ హీరోలలో ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ పై అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. కాగా టాలీవుడ్ ఆసక్తి ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ లో కొనసాగుతుంది. 

కాగా ఈ మూవీ దసరా తరువాత సెట్స్ పైకి వెళ్లనుందని, రాజమౌళి షూటింగ్ కి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరో నెలలో షూటింగ్ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ సంసిద్ధం అవుతున్నారు. మానసికంగా శారీరకంగా తమని తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఒకసారి మొదలైతే జెట్ స్పీడ్ లో సాగుతుందని తెలుస్తుంది. రాజమౌళి నిరవధిక షూటింగ్ జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారట. 

దానికి తోడు ఆర్ ఆర్ ఆర్ లో మిగిలిన షూటింగ్ పార్ట్ దాదాపు భీకర యాక్షన్ సన్నివేశాలని సమాచారం. భారీ ఎత్తున తెరకెక్కనున్న యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్, చరణ్ పాల్గొననున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణలో ఎన్టీఆర్, చరణ్ చెమట చిందించాల్సి ఉంటుందట. ఇక రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్, చరణ్ గాయాలపాలు కాకుండా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారట. ఏదిఏమైనా రానున్న రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఎన్టీఆర్, చరణ్ లకు రాజమౌళి చుక్కలు చూపించడం ఖాయం.