ఆల్రెడీ రామ్ చరణ్ ...తుఫాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా బాలీవుడ్ లో ఆయన అందరికీ సుపరిచితులు అయ్యిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ ని బాలీవుడ్ కు పరిచయం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు సీక్రెట్ గా చేస్తున్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌  హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీగానే ఎక్సపెక్టేషన్స్  ఉన్నాయి. పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారట. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒక లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌ కోసం  బాడీ పెంచే పనిలో ఉన్నాడట ఎన్టీఆర్.  రాజమౌళి... ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరోవైపు బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు ఒక ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎన్టీఆర్‌ పాత్రలో నెగిటివ్ షేడ్స్  కనిపిస్తాయని, తను అటవికుడుగా కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సీన్స్ లో  ఎన్టీఆర్‌ సాధారణంగా, ఇంకొన్ని సన్నివేశాల్లో సిక్స్ ప్యాక్ తో కనపడతారట.   అందుకోసం ఎన్టీఆర్  తన బాడీని మేకోవర్‌ చేసే పనిలో ఉన్నారట.