Allu Arjun : బన్నీతో సినిమా విషయమై క్లారిటి ఇచ్చేసిన రాజమౌళి!

రాజమౌళి  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ RRR కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచ‌నాలు న‌డుమ సినిమా మార్చి 25న విడుదల కానుంది.రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

Rajamouli clarifies on a Movie with Allu Arjun


హీరో అల్లు అర్జున్(Allu Arjun), దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందనే  టాక్‌  మీడియాలో గత రెండు రోజులుగా వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ గత ఏడాది థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో ఈ ప్రాజెక్టు సెట్ చేసారని అని అంటున్నారు. ఈ విషయం విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్  పండుగ చేసుకుంటున్నారు. మరో ప్రక్క రాజమౌళి, మహేష్ కాంబినేషన్  లో సినిమా ప్రారంభం అవుతుంది అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటని మహేష్ ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు. ఈ విషయమై అసలు నిజం ఏమిటో రాజమౌళిని మీడియావారు అడిగారు.

రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో బిజిగా ఉన్న రాజమౌళిని ఈ కాంబినేషన్ విషయమై కదపగా..అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసారు.తానేమి బన్ని తో సినిమా అనుకోలేదని చెప్పినట్లు సమాచారం. మరో ప్రక్క ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని అల్లు అర్జున్‌ కలిసొచ్చారు. దీంతో భన్సాలీ–బన్నీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే టాక్‌ బీటౌన్‌లో మొదలైంది.

ఇక RRR సినిమా రిలీజ్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో జ‌క్క‌న్న త‌న త‌దుప‌రి సినిమాను మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మ‌హేష్ సినిమాను రాజ‌మౌళి రిలీజ్ చేయ‌డానికి ఎంత కాదనుకున్నా 2024 ప‌ట్టేస్తుంది. దాని త‌ర్వాత అంటే 2024లో మొద‌లెట్టినా 2025లోనే వేరే హీరోతో సినిమా ఉండే అవ‌కాశం ఉంది. రాజ‌మౌళితో అల్లు అర్జున్ సినిమా అనేది నిజమైతే ఆయ‌న ఫ్యాన్స్‌కు పెద్ద న్యూస్‌. ఎందుకంటే.. ఇప్ప‌టికే పుష్ప‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ‌న్నీతో రాజ‌మౌళి సినిమా చేస్తే నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంద‌న‌డం ఖాయం.

రాజమౌళి  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ RRR కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచ‌నాలు న‌డుమ సినిమా మార్చి 25న విడుదల కానుంది.రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమా రిలీజ్ తోనే కొత్త కొత్త రికార్డులని సృష్టిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే చాలా దేశాల్లో విడుదలవుతున్నట్లు ప్రకటించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios