Asianet News TeluguAsianet News Telugu

విద్యార్దుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చిన జక్కన్న

భారతదేశంలో జక్కన్న రాజమౌళి క్రేజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రాజమౌళి ఒక కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆసమయంలో విద్యార్థిని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా విభిన్నంగా సమాధానాలు చెప్పాడు.

Rajamaoli interact with students at a college
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:55 PM IST

భారతదేశంలో జక్కన్న రాజమౌళి క్రేజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రాజమౌళి ఒక కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆసమయంలో విద్యార్థిని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా విభిన్నంగా సమాధానాలు చెప్పాడు. విద్యార్థులకు ఎన్నో తెలియని విషయాలను చెప్పడంతో పాటు వారిని ఇన్సిఫైర్ చేయడం జరిగింది. విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు జక్కన్న సమాధానాలు ఇవే..

మీ సక్సెస్ సీక్రెట్ ఏంటీ? వన్ వర్డ్ ఎబౌట్ తారక్.?

సక్సెస్ సీక్రెట్ సక్సెస్ మంత్రాలు అంటూ ఏమీ ఉండవు. అలా ఉంటే అంతా వాటిని పట్టుకుని సక్సెస్ లు తీస్తారు కదా... సక్సెస్ అనేది మనం కష్టపడితే వచ్చేది. ఏ పని చేసినా ఇష్టపడి చేయడం చివరి క్షణంలో కింద పడిపోతున్నాం అనే సమయంలో కూడా కష్టపడుతూనే ఉంటే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది.

దర్శకుడు అవ్వాలనే థాట్ ఎలా వచ్చింది?

నాకు సడన్ గా డైరెక్టర్ అవ్వాలనే థాట్ ఏమీ రాలేదు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటున్నాను అంటూ ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటే అసిస్టెంట్ ఎడిటింగ్ గా జాయిన్ అయ్యాను. ఆ సమయంలోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమా కథల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గర రైటింగ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు యాక్షన్ సీన్స్ రాసే వాడిని. కాని నేను రాసిన యాక్షన్ సీన్స్ - సినిమాలో మరో విధంగా ఉండేవి. అందుకే నేను రాసేవాన్ని - నేను అనుకునేదాన్ని ప్రేక్షకులకు చూపించాలి అంటే సినిమాను నేనే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను - అందుకే దర్శకుడిని అయ్యాను అన్నాడు.

 మీతో సినిమా చేస్తే హీరోల స్టార్ డం మారుతుంది - దీనిపై మీ స్పందన?

 నేను సినిమా చేసే సమయంలో వారి స్టార్ డం గురించి చూడను నాకు కావాల్సిన విధంగా వారు ఉన్నారా లేదా అనేది చూస్తాను. తర్వాత స్టార్ డం అలా వచ్చేస్తుందంతే అన్నాడు.

 ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పండి?

 ఎన్టీఆర్ - ప్రభాస్  - పవన్ - చరణ్ ఇలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కాని వారి గురించి మాట్లాడితే మీకు ఏమైన ప్లస్ అవుతుంది. మీరు రాసుకునే సక్సెస్ మంత్రంలో నేను వారి గురించి మాట్లాడే మాటలు ఎలా ఉపయోగపడతాయి అని అన్నారు. ఆ తర్వాత ప్రభాస్ నాకు మంచి మిత్రుడు - ప్రతి విషయంలో కష్టపడే తత్వం ఉంది. గ్రౌడ్ టు ఎర్త్ వ్యక్తిత్వం. ప్రభాస్ నుండి కష్టపడే తత్వంను మీరు నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.

సినిమాలు చేసేటప్పుడు మీకు భయంగా ఉంటుందా?

 ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. నేను చేసే సినిమా ఎలా ఉంటుందో అనే భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కొసారి నా సినిమా ప్రపంచ రికార్డులన్నీంటికి బద్దలు కొడుతుందని అనిపిస్తుంది. మరోసారి మొదటి రోజే థియేటర్ల తీసేస్తారా అనే భయం కూడా ఉంటుంది అన్నాడు.

 మీకు ఇన్స్ పిరేషన్ ఎవరు?

నాకు ఎంతో మంది ఇన్సిపిరేషన్ ఉన్నారు. సైకిల్ పై పచ్చళ్లు పెట్టుకుని అమ్మి వ్యాపార సామ్రాజ్యంను నెలకొల్పిన వ్యక్తి రామోజీ రావు అంటే నాకు చాలా ఇన్సిపిరేషన్. జయప్రకాష్ గారు అన్నా కూడా నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం అన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios