Asianet News TeluguAsianet News Telugu

మరో చిన్న సినిమాకు దిల్ రాజు సై, పూర్తి డిటేల్స్!

యంగ్ హీరో రాజ్ తరుణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో లవర్ అనే చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యింది. అయితే అందరూ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమా చెయ్యలేడు అనుకున్నారు.

Raj Tarun again with Dil Raju production
Author
Hyderabad, First Published Jan 30, 2019, 12:47 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో లవర్ అనే చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యింది. అయితే అందరూ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమా చెయ్యలేడు అనుకున్నారు. కానీ సినిమా ప్లాఫ్ అయినా దిల్ రాజు...రాజ్ తరుణ్ కు అవకాసమిస్తున్నట్లు సమాచారం. కృష్ణారెడ్డి అనే దర్శకుడు ఈ చిత్రం డైరక్ట్ చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. 

మొదటిగా మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా తో అనుకున్న సబ్జెక్టుని రాజ్ తరుణ్ కు చెప్పి ఒప్పించారని, చిన్న చిన్న మార్పులతో రాజ్ తరుణ్ ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇక అశోక్ రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్టు నుండి బయిటకు వెళ్లారు. త్వరలోనే రాజ్ తరుణ్ తో ఈ సినిమా ప్రారంభం కానుంది. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా కొద్ది పాటి మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు ఈ చిత్రం ఎనౌన్స్ చేస్తారని వినికిడి. 

రీసెంట్ గా ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు కొన్ని మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు నిర్మించే పనిలో ఉన్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు తేడా వచ్చినా పెద్దగా నష్టం ఉండదు కాబట్టి ఇటువంటి సినిమాలు తీయనున్నారు. అందుకుగాను హీరో రాజ్ తరుణ్ తో ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలానే 96 రీమేక్ ని కూడా తెరకెక్కించనున్నాడు రాజు.  

Follow Us:
Download App:
  • android
  • ios