సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన నటుడు రాహుల్ రామకృష్ణ యూ టర్న్ తీసుకున్నారు. మీరందరూ ఫూల్స్... లగ్జరీ లైఫ్ నేనెట్లా వదులుకుంటాను అంటూ షాక్ ఇచ్చాడు.


నటుడిగా రాహుల్ రామకృష్ణ ఏ వన్..అయితే వ్యక్తిగా ఆయన ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన స్పందించే తీరు, చేసే కామెంట్స్
వివాదాస్పదంగా ఉంటాయి. ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోవడం కష్టం. నిన్న ట్విట్టర్ వేదికగా రాహుల్ రామకృష్ణ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ''2022 తర్వాత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా ఈ నిర్ణయంలో మార్పు ఉండదు'' అంటూ పెద్ద డైలాగ్ కొట్టాడు. రాహుల్ రామకృష్ణ ట్వీట్ ఆయన ఫ్యాన్స్ ని విస్మయానికి గురి చేసింది. దీంతో అలా చేయకండి.. మీరు మరిన్ని చిత్రాలలో నటించాలంటూ కామెంట్స్ సెక్షన్ లో విజ్ఞప్తులు పెట్టారు. 

నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన రాహుల్ రామకృష్ణ నేడు ఏప్రిల్ ఫూల్ అంటూ.. మరో షాక్ ఇచ్చాడు. ''మూర్ఖులారా నేను జోక్ చేశాను. కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్.. ఇన్ని బెనిఫిట్స్ నేను ఎలా వదిలేస్తాను? నిన్నటి నుండి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రిటైర్మెంట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇది నేను నమ్మలేకపోతున్నా..'' అంటూ ట్వీట్ చేశారు. తనను అభిమానించే ఫ్యాన్స్ ని ఫూల్స్ అంటూ సంబోధించడం చాలా మందికి కోపం తెప్పించింది. రాహుల్ కామెంట్ కి వాళ్లు అదే స్థాయిలో కౌంటర్లు విసురుతున్నారు. 

Scroll to load tweet…

గతంలో రాహుల్ బాల్యంలో లైంగిక దాడికి గురయ్యానని ఓట్వీట్ చేశారు. అలాగే హుషారు డైరెక్టర్ రాహుల్ రామకృష్ణపై తీవ్ర ఆరోణలు చేశారు. భరత్ అనే నేను సినిమాలో తన యాక్టింగ్ మహేష్ ని డామినేట్ చేస్తుందని నిడివి తగ్గించారని రాహుల్ రామకృష్ణ తనతో చెప్పినట్టు హుషారు డైరెక్టర్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు వివాదాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 

అర్జున్ రెడ్డి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ స్టార్ కమెడియన్ హోదా తెచ్చుకున్నారు. ఇటీవల నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలతో ఆయన చేసిన జాతి రత్నాలు భారీ హిట్ అందుకుంది. 2021 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ ఖాతాలో ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో పాటు విరాటపర్వం ఉంది. కామెడీ పాత్రలకే కాకుండా సీరియస్ రోల్స్ కి రాహుల్ ఫేమస్. 

Scroll to load tweet…

మంచి ఫేమ్ ఉన్నప్పటికీ రాహుల్ వ్యక్తిగత ప్రవర్తన విమర్శలపాలు చేస్తుంది. పబ్లిక్ గా అభిమానులను, సోషల్ మీడియా జనాలను ఫూల్స్ అని సంబోధించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. రాహుల్ ట్విట్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రాహుల్ కామెంట్ చదివిన జనాలు.. తిట్టిపోస్తున్నారు. అయితే ఇవన్నీ పట్టించేకునే రకం అయితే కాదు రాహుల్.