Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ పై .. ఆర్ నారాయణమూర్తి అదిరిపోయే కామెంట్!

ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి చెప్పారు. 

R Narayana Murthy Praise Ap Cm Jagan Mohan Reddy jsp
Author
Hyderabad, First Published Nov 18, 2020, 10:14 AM IST


ప్ర‌జాస‌మ‌స్య‌ల్నే క‌థా వ‌స్తువులుగా ఎంచుకొని  ముందుకు వెళ్తూంటారు ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత,సంగీత దర్శకుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. వెండితెర‌పై ఎర్ర జెండా ఎగ‌రేస్తున్న ఆయనది విజ‌య‌వంత‌మైన ప్ర‌యాణం.కాలం మారినా, తాను మాత్రం న‌మ్మిన సిద్ధాంతాల‌కి క‌ట్టుబ‌డి సినిమాలు తీస్తున్న అరుదైన ద‌ర్శ‌క‌నిర్మాత ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. ఆయ‌న పేరు వినిపించ‌గానే అర్ధరాత్రి స్వతంత్రం మొద‌లుకొని... భూపోరాటం, అడవి దీవిటీలు, స్వతంత్ర భారతం, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, రైతురాజ్యం, ఛలో అసెంబ్లీ, ఊరు మనదిరా, ఎర్ర స‌ముద్రం, ఒరేయ్ రిక్షా, సింగ‌న్న త‌దిత‌ర చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆయన తాజాగా 
 ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డిపై ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు గుప్పించారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ..జగన్ గొప్ప దార్శనికుడని.. అపరభగీరథుడని కొనియాడారు. ఏలేరు తాండవ రిజర్వాయర్లను అనుసంధానించాలని నారాయణమూర్తి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారు. దీంతో నారాయణమూర్తి.. సీఎం జగన్కు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.  ఈ రెండు రిజర్వాయర్లను అనుసంధానిస్తే   తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందుతుందని.. తద్వారా ఈ రెండు జిల్లాలు మరింత సస్యశ్యామలం అవుతాయన్నారు.

అలాగే రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల సీఎం జగన్ శాశ్వత పరిష్కారానికి చూపారని చెప్పారు. ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని దీంతో ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస పోతున్నారని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని నారాయణమూర్తి కొనియాడారు.

ఇక రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అనుసంధాన ప్రాజెక్ట్తో తాండవ ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నారాయణమూర్తి ప్రశంసించారు. సీఎం జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios