తమిళ వెర్సన్ ''ఓడు ఓడు ఆడు'' ప్రోమో సాంగ్ ని చిత్ర టీమ్ సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు. దీనికి లిరిసిస్ట్ వివేక సాహిత్యం అందించారు. ఆ సాంగ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’.అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. విలన్ పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. హిందీలో ఈ పాటను విశాల్ దడ్‌లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ పాటని ఆలపించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక పేరుతో ఈ పాట రూపొందింది.
తాజాగా తమిళ వెర్సన్ ''ఓడు ఓడు ఆడు'' ప్రోమో సాంగ్ ని చిత్ర టీమ్ సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు. దీనికి లిరిసిస్ట్ వివేక సాహిత్యం అందించారు. ఆ సాంగ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమాలో మునుపెన్నడూ చేయని వైవిద్యపాత్రలో నటిస్తున్నాడు బన్నీ. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో పూర్తిగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించబోతుండటం ఆసక్తి కలిగించే విషయం. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ అడ్డుగా నిలిచి షూటింగ్ వాయిదా పడింది. అయితే అన్ని అడ్డంకులు దాటుకుని రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా వారు నిర్మాణ బాగస్వాములుగా ఉన్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
