Asianet News TeluguAsianet News Telugu

డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్న పుష్ప 2 టీమ్.. బన్నీ గడ్డంపై వివరణ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ఆందోళన కరంగా ఉన్నాయి. దీనికి తోడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. 

Pushpa 2 movie team gives clarity on Allu Arjun beard dtr
Author
First Published Jul 18, 2024, 10:54 PM IST | Last Updated Jul 18, 2024, 10:54 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ఆందోళన కరంగా ఉన్నాయి. దీనికి తోడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో బన్నీ గడ్డం లేకుండా కనిపించడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. 

పుష్ప 2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకుని కనిపించాడు. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొందరైతే అసలు పుష్ప 2 చిత్రం ఈ ఏడాది రిలీజ్ అవుతుందనే గ్యారెంటీ లేదని అంటున్నారు. మరికొందరు పుష్ప 2 ఆగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. 

సరైన స్క్రిప్ట్ లేకపోవడం, సీన్లు పదేపదే సుకుమార్ మారుస్తుండడం.. షెడ్యూల్ లేకుండా షూటింగ్ కి వెళ్లడం లాంటి అంశాలతో బన్నీ అసహనానికి గురయ్యాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అందుకే షూటింగ్ కి రాకుండా గడ్డం కట్ చేసి ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిపోయాడని అంటున్నారు. 

అయితే పుష్ప 2 చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. బన్నీ, సుకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. తర్వాతి షెడ్యూల్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకే బన్నీ ట్రిమ్ చేసుకున్నారు. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి గడ్డం తిరిగి వచ్చేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా రూమర్స్ రూపంలో పుష్ప 2 చిత్రానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios