Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేకమైన సెట్ లో 'పుష్ప 2' షూటింగ్.. క్రేజీ అప్డేట్ ఇదిగో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 షూటింగ్ కి సమయం రానే వచ్చింది. పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Pushpa 2 movie shooting update is here
Author
First Published Sep 8, 2022, 9:49 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 షూటింగ్ కి సమయం రానే వచ్చింది. పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కంటే నార్త్ సినీ లవర్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 

దీనితో పుష్ప 2పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సంగతి గమనించిన దర్శకుడు సుకుమార్ ఇన్నిరోజులు పాటు తన క్రియేటివిటీకి పదును పెట్టి పుష్ప 2 స్టోరీ పూర్తి చేశారు. ఇక షూటింగ్ కి సమయం దగ్గర పడింది. ఈ నెల చివరి వారం నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్ నిర్మించారట. ఈ సెట్ లో షూటింగ్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రం మొదటి భాగాన్ని మించేలా భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. 

పుష్ప 2 లో ఉండబోయే విలన్స్ పాత్రలు తలచుకుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. పార్ట్ 2లో ప్రధాన పోటీ పుష్పరాజ్.. షికావత్ మధ్యనే ఉండబోతోంది. షికావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అవకాశం దొరికితే పుష్ప రాజ్ ని చుట్టుముట్టేందుకు దాక్షాయణి, మంగళం శ్రీను, జాలిరెడ్డి లాంటి వాళ్లంతా పొంచి ఉన్నారు. 

పార్ట్ 2లో మరికొన్ని పాత్రలు కూడా యాడ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios