ఇలా వచ్చిందో లేదో.. అలా వైరల్ అవుతున్నాయి పుష్ప2 అప్ డేట్స్.. సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టబోతోంది మూవీ.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. లెక్కల మాస్టార్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండయా అంతా పుష్ప2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక పుష్ప2 నుంచి ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా.. అని ఫ్యాన్స్ కాచుకుని ఉన్నారు. వచ్చిరావడంతోనే పుష్ప అప్ డేట్స్ ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన రెండు పాటలు కూడా ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్,సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. యూట్యూబ్ లో అదరగొడుతోంది సాంగ్.
పాన్ ఇండియా రేంజ్ ఐదు భాషలో రిలీజ్ అయిన ఈసాంగ్ అన్ని లాంగ్వేజ్ లలో కలిపి 175 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతుంది. కేవలం తెలుగు వెర్షన్ లోనే 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు సూసేకి సాంగ్ కి రీల్స్ బాగా చేస్తూ, ఫ్యాన్స్ డాన్స్ వేస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
