Asianet News TeluguAsianet News Telugu

చిరు ‘గాడ్ ఫాధర్‌’ కు పూరి జగన్నాథ్ సాయం ?

 ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందే ఈ  చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Puri Jagannaths inputs for Chiru s Godfather
Author
Hyderabad, First Published Oct 3, 2021, 9:17 AM IST


వివరాల్లోకి వెళితే... మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన అభిమానుల దృష్టి ..చిరు చేయబోయే తర్వాత ప్రాజెక్టు విశేషాలపై పడింది. మెగాస్టార్ హీరోగా మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందే ఈ  చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ  సినిమాకి పూరి తన వంతు సహాయాన్ని అందించబోతున్నారట. "గాడ్ ఫాదర్"   సినిమాలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా చిరంజీవికి సెట్ అయ్యే విధంగా ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమా విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారట. పూరి సలహాలకు అనుగుణంగా స్క్రిప్ట్ మారుస్తున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ మాస్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్. "గాడ్ ఫాదర్" సినిమాలో చిరంజీవిని కూడా ఓ రేంజిలో  మాస్ అవతారం లోనే చూపించబోతున్నారు అని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ని ఆరు నెల్లల్లోనే పూర్తి చేయనున్నారు.  ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. 
 
ఇక ఒరిజనల్ లో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రను చిరు పోషిస్తున్నారు. అందులో ఆ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ గంభీరంగా ఉంటుంది. కానీ, తెలుగు చిత్రానికి వచ్చే సరికి కేవలం మాతృక కథలోని ఆత్మను మాత్రం తీసుకుని చిరు అభిమానులు కోరుకున్న మాస్‌ అంశాలన్నీ జోడించారట. అంతేకాదు, హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్‌. ఇక చిరంజీవి సినిమా అంటే అదిరే స్టెప్‌లు ఉండాల్సిందే. మలయాళంలో అసలు వాటి జోలికే పోలేదు.(ఐటమ్‌ సాంగ్‌ తప్ప) కానీ, తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్టు పాటలు ఉంటాయని టాక్‌. అంతేకాదు, ‘లూసిఫర్‌’ను మించి ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. మరి నిజంగా ఈ మార్పులన్నీ  చేస్తే అవి ఈ సినిమాకు ప్లస్‌ అవుతాయా? లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే!

నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రసీమకు చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా తెలుగుకు పరిచయమయ్యారు. ఇక్కడ విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారు. చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశాడు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios