Asianet News TeluguAsianet News Telugu

ఇస్మార్ట్ శంకర్ హిట్టయితే.. మహేష్ గ్రీన్ సిగ్నల్?

సినిమాలో హీరోలకు ఒక పొగరుతో కూడిన స్టైలిష్ కంటెంట్ ను యాడ్ చేయడంలో పూరి జగన్నాథ్ స్టైలే వారు. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు ఎలా ఉన్నా హీరో పాత్ర మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే అపజయాలు వెంటాడడంతో పూరితో వర్క్ చేయడానికి వేరే హీరోలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. 

 

puri jagannath next with mahesh babu
Author
Hyderabad, First Published Jul 4, 2019, 8:23 AM IST

సినిమాలో హీరోలకు ఒక పొగరుతో కూడిన స్టైలిష్ కంటెంట్ ను యాడ్ చేయడంలో పూరి జగన్నాథ్ స్టైలే వారు. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు ఎలా ఉన్నా హీరో పాత్ర మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే అపజయాలు వెంటాడడంతో పూరితో వర్క్ చేయడానికి వేరే హీరోలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. 

గతంలో బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చిన హీరోలు కూడా కరుణించడం లేదు. సక్సెస్ ట్రాక్ లోకి వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని రేంజ్ లో పూరికి సమాధానాలు వస్తున్నాయట. ఇక ఈ డ్యాషింగ్ డైరక్టర్ తన ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్ పైనే పెట్టుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా డబుల్ దిమాక్ అంటూ ఎదో కొత్తగా ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది. 

అయితే ఈ సినిమా హిట్టయితేనే స్టార్ హీరోలు దర్శకుడికి వెల్కమ్ చెబుతారు. ముఖ్యంగా మహేష్ బాబుతో జనగణమన అనే సినిమా చేయాలనీ పూరి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్టయితే సూపర్ స్టార్ తో పూరి ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉన్నట్లు టాక్. 

కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మహేష్ తరువాత చేద్దామని సున్నితంగా తిరస్కరించాడట. హిట్టుపడితే గాని ఒప్పుకోరని పూరికి అర్ధమయిపోయింది. అందుకే ఇస్మార్ట్ శంకర్ కోసం ప్రాణం పెట్టేశాడు. మరి రామ్ కథానాయకుడిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios